ఆదితి రావు అంతరిక్షం సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.  అయితే ఈ సినిమా కోసం ఈ అమ్మడు పడిన కష్టాలు తెలిస్తే మాత్రం భాద కలగక మానదు . తను ఏం చెప్పిందంటే , బల్గేరియా- ఈస్ట్రన్ యూరప్ వంటి చోట్ల నిపుణులతో కలిసి వర్క్ చేశాం. చాలా రోజుల పాటు రోప్స్లో అలాగే వేలాడుతూ ఉండటం. దారాల సహాయంతో వెనక్కి తిరిగి పల్టీ కొట్టడం గాలిలో ఈదడం వంటి స్టంట్స్ నేర్చుకున్నాను... అని అతిదీ చెప్పింది.

Image result for aditi rao

ఉదయం హైదరాబాద్ లో షూటింగ్ చేసి సాయంత్రానికి మణిరత్న  షూట్ కోసం చెన్నయ్ విమానం ఎక్కాల్సి వచ్చేది. ఒకేసారి రెండు సినిమాలతో కుస్తీలు పట్టాను. ఇక్కడ అంతరిక్షం కోసం ట్రైనింగ్ తీసుకున్నాను. చాలా హార్డ్ వర్క్ చేశాను. దారాల పై వేలాడే సమయంలో రక్తప్రసరణ అగిపోయిన బాధవచ్చినప్పుడు స్టంట్ టీంలో షకీరా అనే అమ్మాయిని పిలిచేదాన్ని తను వచ్చి దారాలను కాస్త వదులు చేసేది.

Image result for aditi rao

మళ్లీ నార్మల్ అయిన తర్వాత మళ్లీ నటించేదాన్ని. పాత్ర కోసం మే ఉపయోగించిన హెల్మెట్ ఎంతో బరువుగా ఉండేది. దాన్ని వేసుకుంటే మెడనొప్పి వచ్చేది. తొమ్మిదో రోజున హెల్మెట్ ధరించగానే భరించలేని నొప్పితో విలవిలలాడాను. డాక్టర్స్10 రోజులు పూర్తిగా బెడ్ రెస్ట్ అన్నారు. ఇంట్లో చెప్పకుండానే భరించాను.. అని అదితీ చాలా సీక్రెట్స్ చెప్పింది. ఈ సినిమాలో రోల్ కోసం ప్రత్యేకంగా వ్యోమగాముల్ని కలవలేదు. అంతా ఊహించుకుని చేయడమే.

మరింత సమాచారం తెలుసుకోండి: