ప్రముఖ హీరో ప్రభాస్ కు సంబంధించిన గెస్ట్ హౌస్ ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు హైదరాబాద్ సమీపంలో రాయదుర్గం పరిధిలోని సర్వే నెం.46లోని స్థలం ప్రభుత్వం స్థలంగా గుర్తిస్తూ సుప్రీం కోర్టు తీర్పుఇవ్వడంతో అధికారులు ప్రభాస్ గెస్ట్ హౌస్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 
సాహో
ఈ సర్వ్ నెంబర్ కు సంబంధించి 84.30 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలం పై ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల మధ్య సుప్రీంకోర్టులో వివాదం కొనసాగింది. అయితే చివరకు కోర్టు దీన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చింది. 
ప్రభాస్ స్పందించాల్సి ఉంది
ఈ స్థలంలో ప్రభాస్‌‌కు 2,200 గజాల్లో గెస్ట్ హౌస్ ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి మూడు నెలల క్రితమే సుప్రీం కోర్టు నుంచి తీర్పు వచ్చినా ఎన్నికల హడావుడితో పాటు ఆ ఎన్నికల సమయంలో ప్రముఖుల స్థలాలు ఇళ్ళు ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకుంటే దానిపై నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అన్న ఆలోచనలతో ఈ స్వాధీన వ్యవహారం ఎన్నికల తరువాత చేపట్టినట్లు తెలుస్తోంది. 
మూడు నెలల క్రితమే తీర్పు వచ్చినా...
వాస్తవానికి ఇలాంటి వివాదాలు నాగార్జున ఎన్ కన్వెంక్షన్ సెంటర్ కు సంబంధించి సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయా స్టూడియోస్ కు సంబంధించి కొనసాగుతూనే ఉన్నాయి. దీనితో రానున్న రోజులలో ఈ వ్యవహారాలు కూడ ఎలాటి ట్విస్ట్ లు తీసుకుంటాయో అన్న ఆతృతలో ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై ప్రభాస్ స్పందించాల్సి ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: