విశ్వనటుడు కమల్‌ హాసన్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు.  1996 సంవత్సరంలో రిలీజయిన భారతీయుడు 3నేషనల్ అవార్డ్స్ అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ భారతీయుడు 2మూవీ ని భారీ బడ్జెట్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రూపొందించనుంది. 550 కోట్ల రూపాయలతో తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా రూపొందించిన 2. 0 సినిమా ఘన విజయం సాధించడంతో  డైరెక్టర్ శంకర్ ‘భారతీయుడు 2’పనుల్లో నిమగ్నమయ్యారట. 
Image result for భారతీయుడు 2 కాజల్
 టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ భారతీయుడు 2 సీక్వెల్ లో హీరోయిన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్ దర్శకత్వంలో సీనియర్ హీరో కమల్ హాసన్ కు జోడీ గా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించడం ప్రేక్షక అభిమానులే కాదు..కాజల్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ సినిమాలో కాజల్ ని కొత్త రూపంలో చూపించబోతున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి. గతంలో భారతీయుడు సినిమాలో సేనాపతి గా కమల్ హాసన్ ‘మర్మకళ’యుద్ద విద్యను కేరళాలో నేర్చుకొని తన శత్రువులతో పోరాడుతాడు. 
Image result for భారతీయుడు 2 కాజల్
ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా రానున్న 'భారతీయుడు 2'లోను 'వర్మకళ' (తమిళంలో వర్మకలై) అనే ప్రాచీన యుద్ధకళను గురించిన సన్నివేశాలు వుంటాయని తెలుస్తోంది. కథ ప్రకారం ఈ సినిమాలో కాజల్ కూడా 'వర్మకళ'ను ప్రయోగించే సన్నివేశాలు వున్నాయట. ఈ కారణంగా ఈ ప్రాచీన యుద్ధకళను కాజల్ కూడా నేర్చేసుకుందట. కాజల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరగానే ఈ యుద్ధవిద్యను నేర్చుకుందని కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: