ఆవిడ అలనాటి నటీమణి, తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో 200 చిత్రాలకు పైగా హీరోయిన్ గా నటించిందామె. ఎంజీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి వంటి నటులతో హీరోయిన్ గా నటించి అలరించింది. ఆమే ఎంజీఆర్ లత. ఆమె ఇటీవల తన జ్ఞాపకాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.



ఎన్టీఆర్‌తో ఎన్నో చిత్రాల్లో నటించిన లత.. ఆయన రాజకీయాల్లోకి రావడంతో ఆ కాంబినేషన్‌కు బ్రేక్ పడిందట. అప్పుడు ఎన్టీఆర్ లతను కూడా రాజకీయాల్లోకి రావాలని స్వయంగా కోరారట. అన్నట్టు లత పూర్వీకులు కూడా కర్నూలు జిల్లాకు చెందిన వారేనట. దాంతో ఎన్టీఆర్ ఆమెను కర్నూలు జిల్లా నుంచి తెలుగుదేశం తరపున ఎన్నికల బరిలో దిగమని కోరారట.



నందమూరి తారక రామారావు కోరికతో లత కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు కాస్త మొగ్గు చూపారట. కానీ రామారావు పెట్టిన ఓ కండీషన్‌తో ఆమె వెనక్కి తగ్గారట. అదేంటంటే.. రాజకీయాల్లోకి వస్తే పూర్తిగా సమయం కేటాయించాలి.. సినిమాలు, షూటింగులు అంటూ తిరిగితే ప్రజాసమస్యలు పట్టించుకోవడం కష్టమవుతుందని అని సూచించారట.



అప్పటికే లత నాలుగు భాషల్లో టాప్ హీరోయిన్.. చేతిలో బోలెడు చిత్రాలు ఉన్నాయి. దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పేందుకు ఇష్టపడలేదట. అలా తన రాజకీయ రంగ ప్రవేశం ఆగిపోయిందట. సినిమాలు వదులుకోని రాజకీయాల్లోకి రాలేనని లత సున్నితంగా రామారావుకు చెప్పేశారట. అదీ సంగతి.


మరింత సమాచారం తెలుసుకోండి: