తెలుగు ఇండస్ట్రీలో ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘బాహుబలి’, ‘బాహుబలి 2’. ఈ చిత్రాల కోసం ఏకంగా ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు జక్కన్న.  ప్రభాస్, రానా ఇద్దరూ పోటా పోటీగా నటించారు.  ఈ చిత్రం జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంది.  ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు.  అయితే హీరోయిన్ల పేర్లు మాత్రం ఇప్పటికీ అధికారికంగా బయటకు రాలేదు.
Image result for rrr movie
ఈ మద్య స్టార్ హీరోల చిత్రాలకు సంబంధించిన స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.  తాజాగా ‘ఆర్ఆర్ఆర్’మూవీకి సంబంధించి ఓ స్టోరీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  ఇటీవలే ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, జనవరిలో సెకండ్ షెడ్యూల్ ను మొదలెట్టనుంది. ఈ కథ ఆంగ్లేయుల కాలంనాటి నేపథ్యంలో  కొనసాగుతుందనే వార్తలు ఆరంభంలోనే వినిపించాయి.  అయితే ఈ చిత్రంలో బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్ గా రాంచరణ్ కనిపించబోతున్నారట..ఇక బందిపోటు దొంగగా ఎన్టీఆర్ కనిపించబోతున్నారట. 
Related image
అయితే వీరి ఇద్దరు అన్నదమ్ములా..కొన్ని కారణాల వల్ల విడిపోతారా..వాళ్లు పెరిగిన పరిస్థితుల వల్ల ఒకరు పోలీస్ గా..మరొకరు గజదొంగగా మారుతారని  ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. వాస్తవానికి ఇలాంటి చిత్రాలు గతంలో ఎన్నో వచ్చాయి..మరి రాజమౌళి ఇలాంటి కథ ఎంచుకుంటే ఎలా చూపించబోతారో అని అనుకుంటున్నారు. ఈ చిత్రంలో రాంచరణ్ బాబాయిగా పాత్రలో ప్రముఖ తమిళ దర్శకుడు .. నటుడు సముద్రఖని నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Related image
 'రఘువరన్ బీటెక్'లో ధనుశ్ తండ్రి పాత్ర ద్వారా సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.  ఈ చిత్రంలో ఆయన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.  అయితే ఫిల్మ్ నగర్లో షికారు వార్తలు అంతగా నమ్మాల్సిన అవసరం లేదని కొంత మంది అభిమానులు కొట్టి పడేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: