జూనియర్  ఎన్టీఆర్ కు కొద్ది నెలలల క్రితం పుట్టిన కొడుకు భార్గవ రామ్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. జూనియర్ కు పిల్లలు అంటే ఉన్న విపరీతమైన ఇష్టంతో తన రెండవ కొడుకు పుట్టిన తరువాత కొద్ది రోజులు షూటింగ్ కు కూడ అప్పట్లో డుమ్మా కొట్టాడు. అయితే ఈ మధ్య జూనియర్ కు తన చిన్న కొడుకు భార్గవ రామ్ కు  సంబంధించిన  చిట్టి పాదాలు చిట్టి చేతులను పోలిన కొన్ని కళాఖండాలను క్రియేట్ చేసి వాటిని భద్ర పరుచు కోవాలి అన్న కోరికతో  ప్రముఖ ఫస్ట్ ఇంప్రెషన్ సెలబ్రిటీ ఆర్టిస్ట్ భావన జర్సా సహాయం తీసుకోవడమే కాకుండా ఆమెను ప్రత్యేకం గా ముంబై నుండి  రప్పించాడు. 
ఎన్టీఆర్ ‘ఆర్ఆర్‌ఆర్' లుక్ అదిరిపోయింది
ఈవిషయానికి  సంబంధించిన ఫోటోలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్ ఆయన సతీమణి లక్ష్మి ప్రణతితో పాటు ప్రముఖ ఫస్ట్ ఇంప్రెషన్ ఆర్టిస్ట్ భావన జర్సా కూడా ఉన్నారు. ఇండియాలో ప్రఖ్యాత ఫస్ట్ ఇంప్రెషన్ సెలబ్రిటీ ఆర్టిస్ట్ అయిన భావన పిల్లలు పుట్టిన తర్వాత వారి చిట్టి పాదాలు చేతులు పోలిన కళాఖండాలు క్రియేట్ చేయడంలో ఎక్స్‌పర్ట్. 
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన భావన జర్సా
తమ పిల్లల జ్ఞాపకాలను పదిల పరుచుకోవడానికే ఎన్టీఆర్ దంపతులు ప్రస్తుతం భావన సలహాలు తీసుకుంటున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ముని మనవడు భార్గవ రామ్ కోసం జూ ఎన్టీఆర్‌ తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ ఆమె ట్విట్ చేసింది. ఈఫోటోలో కనిపిస్తున్న విధంగా భారవ్ రామ్ జ్ఞాపకాలను తయారు చేసి ఎన్టీఆర్ దంపతులకు త్వరలో భావన అందించబోతోంది.  
త్వరలో ఇలాంటివి...
ఈవిషయానికి సంబంధించిన ఫోటోలో భావనతో భారీ గడ్డంతో కొత్త లుక్ లో కనిపిస్తున్న జూనియర్ లుక్ అందరినీ  బాగా ఆకర్షి స్తోంది. రాజమౌళి  ‘ఆర్ఆర్ఆర్' మూవీలో ముస్లిం యువకుడిగా జూనియర్ కనిపించ బోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్న  విషయంతెలిసిందే..



మరింత సమాచారం తెలుసుకోండి: