తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ స్థాయిలో కూడా ఎంతో క్రేజ్ ఉంది.  ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తుంటారు. కానీ లింగ సినిమా నుంచి మొన్నటి కాలా వరకు వరుసగా పరాజయాలు పొందుతున్న రజినీ ఈ మద్య శంకర్ డైరెక్షన్ లో వచ్చిన 2.0 సినిమాతో తన క్రేజ్ అమాంతం పెంచేశారు.  ఈ సినిమా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రూ.700 కలెక్షన్లు దాటినట్లు సమాచారం.  అంతే కాదు బాహుబలి, సర్కార్ సినిమాల రికార్డులు కూడా బ్రేక్ చేసినట్లు ఫిలిమ్ వర్గాల టాక్. 

2.0 సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలోనే రజినీకాంత్ ‘కాలా’ సినిమా పూర్తి చేశారు.  ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో 'పెట్టా' సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో రజనీ సరసన కథానాయికలుగా సిమ్రాన్,త్రిష నటించారు.  అయితే త్రిష ఇన్నేళ్ల కెరీర్ లో ఇదే మొదటి సారి రజినీ సరసన నటించడం.  'పెట్టా' ఫస్ట్ లుక్, లిరిక్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

సంక్రాంతి కానుకగా ఈ సినిమాను తమిళంలో,తెలుగులోను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ తెలుగులో విడుదలను వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చారనేది తాజా సమాచారం.  ఈ సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు వరుసగా పోటీ పడుతున్నాయి.  బాలకృష్ణ 'కథానాయకుడు',చరణ్ 'వినయ విధేయ రామ', వెంకటేశ్ 'ఎఫ్ 2' సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి.

అంతే కాదు ఈ మూడు సినిమాలు కూడా భారీ రేంజ్ లో విడుదల కావడం విశేషం. ఈ కారణంతోనే 'పెట్టా' సినిమాకి థియేటర్ల సమస్య ఏర్పడే అవకాశం వుంది. అంతేకాదు వసూళ్లపై కూడా ప్రభావం చూపే ఛాన్స్ వుంది. అందువలన తెలుగులో కొంత గ్యాప్ తీసుకుని 'పెట్టా'ను విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించుకున్నారని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: