సీనియర్ హీరో రాజశేఖర్ పై అడవి శేషు కోపంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం అతడు లేటెస్ట్ గా రాజశేఖర్ కూతురు శివానితో కలిసి నటిస్తున్న ‘2 స్టేట్స్’ మూవీ వ్యవహారం అని అంటున్నారు. ‘క్షణం’ మూవీ తరువాత అడివి శేష్ ఇమేజే పూర్తిగా మారిపోవడంతో నటుడిగా మాత్రమే కాకుండా సినిమా కూడ అతడు ఎంతో ఇమేజ్ ని పెంపొందించుకున్నాడు. 

ఆతరువాత అతడు తన మారిన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న సినిమాలు ఈ నటుడి ఇమేజ్ ని మరింత పెంచుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ సంవత్సరం విడుదలైన ‘గూఢచారి’ మూవీ అడవి శేషు ఇమేజ్ ని మరింత పెంచింది. ప్రస్తుతం ‘గూఢచారి-2’ గురించి ఆలోచనలు చేస్తున్న అడవి శేషుకి రాజశేఖర్ వ్యవహార శైలి తలనొప్పిగా మారిందని సమాచారం. 
Jeevitha Rajasekhar’s daughter Sivani
రాజశేఖర్ కూతురు శివానిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్న ను ‘2 స్టేట్స్’ రీమేక్‌ లో అడవి శేషు నటిస్తున్న పరిస్థుతులలో ఈ సినిమాకు తొందరపడి కమిట్ అయ్యానని శేష్ తన సన్నిహితుల దగ్గర ఫీలవుతున్నట్లు టాక్. ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ విషయాలలో రాజశేఖర్ కుటుంబం విపరీతంగా జోక్యం చేసుకుంటోందని శేషు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. 
Shivani Rajasekhar Wiki
దీనికితోడు ఈమూవీ స్క్రిప్ట్ విషయంలో రాజశేఖర్ విపరీతంగా జోక్యం చేసుకుంటూ తన కూతురు శివాని పాత్రను పెంచమని ఆమూవీ దర్శక నిర్మాతల పై ఒత్తిడి చేయడం కూడ శేషుకు అసహనంగా మారిందని సమాచారం. దీనితో ఈ సినిమా విషయాలను పట్టించుకోకుండా ఈమూవీ ఎప్పుడు విడుదల అయినా తనకు సంబంధం లేదన్నట్లు ప్రవర్తించాలని అడవి శేషు ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి..    



మరింత సమాచారం తెలుసుకోండి: