టాలీవుడ్ లో ఈ మద్య వరుసగా కమెడియన్ల ఎంట్రీతో సీనియర్లు హవా తగ్గిపోతుంది.  ఒకప్పుడు వెండితెరపై బ్రహ్మానందం, ఆలి, వేణు మాదవ్, సునీల్ లాంటి వారు కనిపిస్తే చాలు కడుపుబ్బా నవ్వుకునేవారు. అందాల రాముడు సినిమాతో కమెడియన్ గా ఉన్న సునీల్ హీరోగా మారారు. ఆ తర్వాత సిక్స్ ప్యాక్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు.  రాజమౌళి దర్శకత్వంలో ‘మర్యాదరామన్న’సునీల్ కి మంచి గుర్తింపు తెచ్చింది.  వరుసగా హీరోగా నటించిన సునీల్ కి తర్వాత సినిమాలు ఏదీ కలిసిరాలేదు.  దాంతో తన ఉనికికే ప్రమాదం వస్తుందని భావించిన సునీల్ ఆ మద్య త్రివిక్రమ్ శ్రీనివాస్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’సినిమాలో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చారు.  కానీ ఈ సినిమా కూడా సునీల్ కి పెద్దగా కలిసి రాలేదు. 
Image result for comedian sunil
ఇక టాలీవుడ్ లో థర్టీఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు కమెడియన్ ఫృథ్వి.  రూపం పరంగా తాను కమెడియన్ గా కనిపించననీ, కానీ తన మేనరిజమ్స్ .. డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను నవ్విస్తాయని చెప్పే పృథ్వీ త్వరలో 'బ్లఫ్ మాస్టర్' సినిమాతో పలకరించనున్నాడు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇండస్ట్రీ అన్న తర్వాత ఒక్కొక్కరికీ ఒక్కో టైమ్ కలిసి వస్తుంది.  గతంలో బ్రహ్మానందం, సునీల్ కి బాగా కలిసి వచ్చాయి.  గత కొంత కాలంగా తనకు అదృష్ట కలిసి వచ్చిందని..తన పేరడీ డైలాగ్స్ తో ప్రేక్షకులు ఎంతో సంతోషిస్తున్నారని అన్నారు.
Related image
ప్రస్తుతం ఇండస్ట్రీలో కమెడియన్ గా నా స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. కామెడీని వదిలేసి సునీల్ ఏడేళ్లపాటు హీరోగా చేశాడు..మళ్లీ ఇప్పుడు కమెడియన్ గా చేస్తున్నాడు.  ఆ మద్య కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నానని..ఇది చేస్తాడనీ..పొడిచేస్తాడని అన్నారు. కానీ ఈసారి ఆయన కమెడియన్ గా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాడు. హీరోగా కొనసాగుతూ..కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తే..కొంత మంది అభిమానులు రీసీవ్ చేసుకోవడం కష్టమే అని అంటు సంచలన వ్యాఖ్యలు చేశారు ఫృథ్వి. 


మరింత సమాచారం తెలుసుకోండి: