సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రాజెక్ట్ ను నిర్మాత దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా మారిన ఈమూవీ ప్రాజెక్ట్ ను దానయ్య దగ్గర నుండి టెక్ ఓవర్ చేయాలనీ చాలామంది ప్రముఖ వ్యక్తులు ప్రయత్నించారు. 

ఈవిషయమై రాజమౌళి ద్వారా దానయ్యతో రాయబారాలు చేయడమే కాకుండా కొందరు ప్రముఖ నిర్మాతలు దానయ్యకు అత్యంత భారీ మొత్తాలను గుడ్ విల్ గా ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆఫర్స్ అన్నీ తిరస్కరించి దానయ్య ఎవరినీ కలుపుకోకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ విషయంలో ధైర్యంగా నిలబడటం వెనుక రామ్ చరణ్ హస్తం ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రచారంలో ఉన్న వార్తల ప్రకారం చరణ్ తాను లేటెస్ట్ గా దానయ్య నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ‘వినయ విధేయ రామ’ కు సంబంధించి తనకు రావలసిన పారితోషికాన్ని ‘ఆర్ ఆర్ ఆర్’ పెట్టుబడి కోసం వదులుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘రంగస్థలం’ తరువాత చరణ్ కు ఏర్పడిన క్రేజ్ రీత్యా అతడి పారితోషికం 20 కోట్లకు చేరుకున్నా ‘వినయ విదేయ రామ’ కు సంబంధించి పారితోషికం తీసుకోకుండా దానయ్యకు ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన  ఒత్తిడులు తగ్గించే విధంగా సహకరిస్తున్నట్లు టాక్. 

అంతేకాదు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ బడ్జెట్ అత్యంత భారీగా ఉండటంతో ఆమూవీ బడ్జెట్ కు సంబంధించి కూడా చరణ్ భారీ మొత్తాలను దానయ్యకు అప్పుగా ఇస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తాలు అన్నీ ‘ఆర్ ఆర్ ఆర్’ బిజినెస్ పూర్తి అయిన తరువాత చూసుకుందామని అప్పటి వరకు ‘ఆర్ ఆర్ ఆర్’ పెట్టుబడి విషయంలో ఎటువంటి టెన్షన్ లు పెట్టుకోవద్దు అంటూ ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ వెనుక చరణ్ షాడో ఇన్వెస్టర్ గా దానయ్యకు అన్నివిధాల సహకరిస్తున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: