తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన వెండి తెరపై అలా కనిపిస్తున్నారంటే.. టెక్నిషియన్స్ ప్రతిభ ఎంతో ఉంది. తాజాగా రజినీకాంత్ కి ఎంతో ఇష్టమైన ఆయన మేకప్ మేన్‌  ముత్తప్త (75)  మృతి చెందారు.  త‌మిళ ప‌రిశ్ర‌మలో ప్ర‌ముఖ హీరోలంద‌రికి ముత్తప్ప మేక‌ప్ మ్యాన్‌గా ప‌నిచేశారు. 

సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం మేకప్ ఆర్టిస్టుగా పనిచేసిన ఆయన తమిళ సినీ దిగ్గజాలు శివాజీ గణేశన్, కమలహాసన్ వంటి వారికి కూడా మేకప్ ఆర్టిస్టుగా పనిచేశారు. ఏవియ‌మ్ సంస్థ‌లో చాలా కాలం ప‌నిచేసిన ముత్త‌ప్ప ఏవియ‌మ్ ముత్త‌ప్ప‌గా అందరికి సుప‌రిచితుడ‌య్యాడు. ర‌జ‌నీకాంత్ ప‌ర్స‌న‌ల్ మేక‌ప్‌గా ఉన్న ముత్త‌ప్ప దాదాపు 60 సంవ‌త్స‌రాలుగా సినీ రంగానికి సేవ‌లు అందిస్తున్నాడు. 
Image result for rajini kanth makapmen muthappa
ఆయన మరణవార్త తెలిసిన వెంటనే రజనీకాంత్ సహా పలువురు స్టార్లు ఆయన ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. కోలీవుడ్ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని వారు కోరారు. 

Image result for rajini kanth makapmen muthappa passes away



మరింత సమాచారం తెలుసుకోండి: