రాజమౌళి ప్రముఖ దర్శకుడిగా మారడం వెనుక విజయేంద్ర ప్రసాద్ అందించిన అద్భుతమైన కధలు కీలక పాత్ర పోషించాయి అనడంలో ఎటువంటి సందేహంలేదు. 75 సంవత్సరాల వయస్సు దాటిపోయినా ఒక యంగ్ రైటర్ గా పరుగులు తీస్తున్న విజయేంద్ర ప్రసాద్ స్పీడ్ చూసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఆశ్చర్యపోతోంది.
మణికర్ణిక
ఇలాంటి పరిస్థితులలో 2019 లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మణికర్ణిక’ ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ రాణి లక్ష్మీ భాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న ముంబైలో అత్యంత ఘనంగా జరిగింది. కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈమూవీకి సంబంధించి ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో చోటు చేసుకున్న ఒక సంఘటన అందరిని ఆశ్చర్యపరిచింది.  ‘బాహుబలి’ సృష్టి కర్త విజయేంద్ర ప్రసాద్ కాళ్ళకు కంగన నమస్కరించడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 
జనవరి 25న విడుదల
బాలివుడ్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్స్ లో అత్యంత అహంకారిగా పేరుగాంచిన కంగన విజయేంద్ర ప్రసాద్ కళ్ళకు మొక్కడంతో ఆమెలో ఈకోణం కూడా ఉందా అంటూ మీడియా ఆశ్చర్యపోతోంది. ఈ సంఘటన పై  ఉమైర్ సంధు స్పందిస్తూ ‘క్లాసిక్ రైటర్ విజయేంద్రప్రసాద్ కాళ్లు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం చూసి ఆశ్చర్యపోయాను. పెద్దలకు ఆమె ఇచ్చే గౌరవం చూసి ముచ్చటేసింది’ అని ట్వీట్ చేసాడు.
 కథ అందించింది ఆయనే
‘మణికర్ణిక’ లక్ష్మిభాయిగా ఎలా మారింది ఎలాంటి పరిస్థితుల్లో ఝాన్సీ రాణిగా బాధ్యతలు చేపట్టింది. తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేసిన సాహసాల తీసుకున్న నిర్ణయాలు ఇలా ప్రతి అంశం ఈ సినిమాలో అద్భుతంగా చూపించబోతున్నారు. వాస్తవానికి  క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈమూవీ షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయిన అనంతరం అనేక భేధాభిప్రాయాల కారణాలతో క్రిష్ ఈ మూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నతరువాత మిగతా భాగాన్ని కంగనా రనౌత్ తన దర్శకత్వంలో పూర్తిచేసిన విషయం తెలిసిందే.  దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈమూవీ జనవరి 25న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: