మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిన్న జరిగిన ‘అంతరిక్షం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ పై తీవ్రవిమర్శలు వస్తున్నాయి అనుకోకుండా చరణ్ చేసిన కామెంట్స్ చాలా మంది డైరెక్టర్స్ మనో భావాలు దెబ్బ తీసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమావాళ్ల పొగడ్తలు ఒక రేంజ్ లో ఉంటూ ఒకోసారి శృతిమించుతు ఉంటాయి అన్న విషయానికి ఉదాహరణగా నిన్నటి చరణ్ కామెంట్స్ ఉన్నాయి అని అంటున్నారు. అత్యుత్సాహంతో  శృతిమించి చరణ్ నిన్న సంకల్ప రెడ్డి ప్రతిభను పొగుడుతూ చేసిన కామెంట్స్ అనుకోని వివాదాలకు కారణం అయ్యాయి అన్న వార్తలు వస్తున్నాయి. 
ఆయన కటౌట్ ఇంతే... కానీ విజన్ గొప్పగా ఉంది
ఇక వివరాలలోకి వెళ్ళితే నిన్న జరిగిన ‘అంతరిక్షం. ప్రీరిలీజ్ ఫంక్షన్ లో సంకల్ప రెడ్డి ప్రతిభ గురించి చరణ్ మాట్లాడుతూ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోని ముగ్గురు దర్శకుల స్థాయితో సంకల్ప రెడ్డి స్థాయిని పోలుస్తూ చరణ్ సంచనల వ్యాఖ్యలు చేసాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గొప్ప ఆలోచనలతో కూడిన దర్శకులు రాజమౌళి సుకుమార్ క్రిష్ అని అంటూ ఆలిస్టులోకి సంకల్ప రెడ్డి చేరిపోతాడు అంటూ కామెంట్స్ చేసాడు. వినడానికి ఈమాటలు బాగానే ఉన్నా తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్ప ఆలోచనలు ఉన్న దర్శకులు ఆ ముగ్గురేనా మరి ఎవ్వరు లేరా అంటూ అప్పుడే చర్చలు మొదలైపోయాయి. 
వరుణ్‌ను చూసి జలస్ ఫీలయ్యా
సాధారణంగా ఈమధ్య చాలామంది టాప్ హీరోలు తమ సినిమాలకు పనిచేస్తున్నవాళ్లని అదేవిధంగా భవిష్యత్ లో తాము కలిసి పనిచేయాలనుకుంటున్న వాళ్లని మాత్రమే గుర్తు పెట్టుకుంటూ మిగతా వ్యక్తులు ఎంతగొప్ప వ్యక్తులు అయినా వారి పేర్లు మరిచి పోతున్నారు. ఇప్పుడు చరణ్ విషయంలో కూడ ఇదే జరిగింది. ‘రంగస్థలం’ తో తనకు సూపర్ హిట్ ఇచ్చాడు కాబట్టి సుకుమార్ ని గతంలో ‘మగధీర’ చేసి ఇప్పుడు    ‘ఆర్ ఆర్ ఆర్’ చేస్తున్నాడు కాబట్టి రాజమౌళిని ఇక స్టేజ్ పై ఉన్నాడు కాబట్టి క్రిష్ ని చరణ్ గుర్తించాడు కాని మిగతా ప్రముఖ దర్శకుల పేర్లు చరణ్ మరిచిపోయడా అంటూ సెటైర్లు పడుతున్నాయి. 
 బాబాయ్ చెప్పిన మాట గుండెల్లోకి దూసుకెళ్లింది
నిన్నటితరం గొప్ప దర్శకుల పేర్లు దర్శకులు రామ్ చరణ్ కు గిఉర్తుకు లేకపోయినా కనీసం ఈ నాటితరం ప్రముఖ దర్శకుల పేర్లు కూడ పూర్తిగా రామ్ చరణ్ కు గుర్తుకు రాలేదా అంటూ విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు చరణ్ దృష్టిలో రాజమౌళి సుకుమార్ క్రిష్ లు తప్ప మరెవ్వరు కనిపించక పోవడం అతని అజ్ఞానానికి నిదర్శనం అంటూ మరికొందరు ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. దీనితో యధాలాపంగా చరణ్ అన్న మాటలు అనుకోని వివాదాలకు కేంద్రం కావడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: