సూపర్ స్టార్ రజినీకాత్ ఎంత సీనియర్ హీరో అయినా...ఆయన సరసన ఛాన్స్ వచ్చిందంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది.  భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా రజినీకాంత్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న పెట్టా మూవీలో ఛాన్స్ వచ్చిందని..ఇది తన అదృష్టం అని..తన కెరీర్ లో ఈ చాన్స్ కోసం ఎంతో కాలం ఎదురు చూశానని ప్రముఖ నటి త్రిష ఆ మద్య సోషల్ మీడియా సాక్షిగా వెల్లడించింది.  ఇక రజినీకాంత్ నటించిన ‘పెట్టా’మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూసినా..ఆ సమయంలో టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు ఉండటంతో వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
Related image
రజినీకాంత్ ప్రముఖ దర్శకులు మురుగదాస్ తో  ఓ సినిమాలో నటించబోతున్నారు.  ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులతో మురుగదాస్ బిజీగా వున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సినిమాలో రజినీ సరసన ఎవరు నటించబోతున్నారన్న ఉత్సాహం అభిమానుల్లో నెలకొంది.  అయితే రజినీ సరసన నటించబోతుంది..‘మహానటి’ఫేమ్ కీర్తి సురేష్ అంటూ మాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మద్య రజినీకాంత్ యంగ్ హీరోయిన్లతో నటించడం చాలా అరుదుగా కనిపిస్తుంది.
Related image
తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ..సీనియర్ హీరోయిన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటిది ఆయన సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ పేరు తెరపైకి రావడం కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మద్య వరుస హిట్స్ తో దూసుకు పోతున్న మళియాళీ భామ కీర్తి సురేష్ కి ఇంత త్వరగా రజినీ సరసన నటించే అవకాశం దక్కడం అదృష్టమని చెప్పుకుంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో..అఫిషియల్ గా అనౌన్స్ చేసే వరకు క్లారిటీ లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: