సైబరాబాద్ రాయదుర్గం పరిదిలోని "పైగా" భూముల విషయంలో ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్స్తుల మద్య కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. ఆ భూములు ప్రభుత్వానికి  చెందినవని ఇటీవల సుప్రీం కోర్టు తేల్చింది. దీంతో అక్కడి కట్టడాలను ఇటీవల రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. ఈ సందర్భంగా రాయదుర్గం లోని తన గెస్ట్‌హౌజ్‌ను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేయడంపై సినీ నటుడు ప్రభాస్‌ హైకోర్టు ను ఆశ్రయించారు.


రెవెన్యూ అధికారులు ప్రభాస్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో, సీజ్ చేశారు.  సీజ్‌ చేసిన భూమికి తామే హక్కుదారులమంటూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పై  న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఆ తరవాత కేసు ప్రత్యేకత దృష్ట్యా కావచ్చు ప్రభాస్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు, ధర్మాసనానికి బదిలీ చేసింది.
Image result for prabhas guest house seized in rayadurgam
అయితే అధికారుల చర్యలను సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యం పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ విచారణ చేపట్టారు. నిబంధ నలను పాటించకుండా, కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సీజ్ చేయడం చట్ట విరుద్ధమని ప్రభాస్ తరఫు న్యాయవాది వాదించారు.  అధికారుల తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. 


అయితే ఈ వివాదం చాలా మందికి సంబంధించింది గనక ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ పిటిషన్‌ పై ధర్మాసనం రేపు అంటే గురువారం విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Image result for prabhas guest house seized in rayadurgam
ఇటీవల రాయదుర్గం పాన్‌ మక్తా సర్వే నంబర్‌ 46 లోని 84 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారిచేసింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సోమవారం చర్యలు చేపట్టారు. ఇందులో 2,200 గజాల్లో ప్రబాస్‌ గెస్ట్‌-హౌస్‌ నిర్మించడంతో దాన్ని కూడా అధికారులు సీజ్‌ చేశారు. ప్రభాస్‌ గెస్ట్‌ హౌస్‌ వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించారు. గతంలో ఈ భూమిని జీవో నంబర్‌ 59 కింద క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రభాస్‌ దరఖాస్తు చేసు కున్నట్టుగా తెలిసింది.
 Image result for prabhas guest house seized in rayadurgam

మరింత సమాచారం తెలుసుకోండి: