ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి మల్టీస్టారర్ చేయడం అంటే ఆ స్టార్ హీరోల అభిమానుల అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ ప్రాజెక్ట్ పై అందరి కన్ను ఉంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడుతుంది.


ఇక ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ బందిపోటుగా కనిపిస్తాడని.. చరణ్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. స్వాతంత్రానికి ముందు జరిగే కథగా పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమా వస్తుందట. అయితే ఈ సినిమాలో చరణ్ కాస్త ఎక్కువ బాధ్యత మోస్తున్నాడని తెలుస్తుంది. అదేంటి ఎన్.టి.ఆర్ కు ఎక్కువ రోల్ ఉంటుందని అన్నారు.


ట్రిపుల్ ఆర్ లో ఎన్.టి.ఆర్ ప్రత్యేకంగా కనిపిస్తాడని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు చరణ్ కు అప్పర్ హ్యాండ్ ఎలా అవుతుంది అంటే.. సినిమాలో చరణ్, ఎన్.టి.ఆర్ సమానమైన పాత్రలు పోశిస్తున్నారట. అయితే ఆఫ్ స్క్రీన్ చరణ్ ట్రిపుల్ ఆర్ బడ్జెట్ లో కూడా షేర్ చేసుకుంటున్నాడని అంటున్నారు. 


డివివి దానయ్య నిర్మాణంలోనే చరణ్ ప్రస్తుతం చేస్తున్న వినయ విధేయ రామ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం చరణ్ ఓ 20 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంది. ట్రిపుల్ ఆర్ కు దానయ్యే నిర్మాత మొత్తం కలిపి 40 కోట్లు అందుకే అవేవి తీసుకోకుండా ట్రిపుల్ ఆర్ బడ్జెట్ లో కేటాయించమని చెప్పాడట. రాజమౌళి సినిమా కాబట్టి గురి తప్పదు. సో లాభాల్లో వాటా తీసుకుంటాడని చెప్పాడట.   



మరింత సమాచారం తెలుసుకోండి: