ఒకపుడు సినిమా హాలుకు వెళ్ళి వినోదం పొందే సగటు జీవికి ఇపుడు ఇంట్లో బుల్లి తెర ఎంతో వినోదం అందిస్తోంది. ముఖ్యంగా సీరియళ్లకు ఆడవారు బాగా అలవాటు పడిపోయారు. అదొక వ్యసనంగా మారిపోయింది. దాంటో ప్రతీ చానెళ్ళో పదుల సంఖ్యలో సీరియళ్ళు వస్తున్నాయి. పొరపాటున కరెంట్ పోయినా తట్టుకోలేని పరిస్థితికి వచ్చేశారు.  మరి ఇదే అదనుగా పే చానళ్ల యాజమాన్యాల డిమాండూ పెరిగిపోయింది.. దాంతో వారు తమ చిత్తం వచినట్లుగ రేట్లు పెంచెస్తూ ముక్కు పిండి వసూల్ చేస్తున్నారు ఈ నేపధ్యంలో మరో మారు కేబులు చార్జీలు పెరగనున్నాయట.


నెత్తి మీద పిడుగే :


సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) తీసుకొచ్చిన కొత్త టారిఫ్‌ ఈ నెల 29 అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. అదే జరిగితే ఒక్కొక్క పే చానల్ కనీసంగా 600 రూపాయల నుంచి 800 రూపాయల వరకూ వసూలు చేస్తుందట. దాంతో  ఎమ్మెస్వోలు ఆందోళన బాట పడుతున్నారు. ఇంత పెద్ద మొత్తం సామాన్యుడు నుంచి వసూలు చేయలేం, అలా వసూలు చేసి పే చానళ్ళ యాజమాన్యాల చేతుల్లో పోయలేము అంటూ చేతులెత్తేస్తున్నారు.


పే చానళ్ళు రావట:


దీనికి మధ్యే మార్గంగా పే చానళ్ళను ఈ నేల 29 అర్ధరాత్రి తరువాత కట్ చేస్తామని  ఎమ్మెస్వోలు స్పష్టంగా చెబుతున్నారు. జెమిని, ఈటీవి ,మాటీవి, జీ టీవి నుండి ఒక్కో ఛానల్ ని మాత్రమే ప్రేక్షకులకి అందించబోతున్నామని చెప్పారు. మిగతా చానళ్లని నిలిపివేస్తున్నామని ప్రకటించారు. మరి అదే కనుక జరిగితే ప్రతి ఇంట్లో టీవీ సీరియ‌ళ్ళు లేక వెలవెలపోతాయన్నమాట. ఇదిలా ఉండగా ఎమ్మెస్వోలు అన్ని తెలుగు ఛానళ్లను కేవలం రూ.40కే అందిస్తున్నారని, కోర్టు నిర్ణయంతో పే ఛానల్స్‌ అధిక రేట్లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 


 ఛానల్స్‌ అన్ని ఫ్రీ టు ఎయిర్‌ అయ్యేవరకు ప్రేక్షకులు సహకరించాలని రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెస్వోలు కోరుతున్నారు. పే చానల్స్‌ను చూడడం తగ్గిస్తే వాళ్లే దారికొస్తారని సలహా కూడా ఇస్తున్నారు. నిజానికి ఎమ్మెస్వోలు చెప్పినది కరెక్టే బుల్లి తెర ప్రేక్షకులు బలహేనతను ఆసరాగా చేసుకుని పే చానళ్ళు రేట్లు పెంచుకుంటున్నారు. కానీ ఎంత వరకూ ప్రేక్షకులంతా ఒక్కటిగా నిలబడి పే చానళ్ళ ఆధిపత్యానికి చెక్ పెడతారన్నది పెద్ద ప్రశ్నగానే ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: