రేపువిడుదల కాబోతున్న ‘అంతరిక్షం’ మూవీని ప్రమోట్ చేస్తూ వరుణ్ తేజ్ ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెద్దనాన్న చిరంజీవి పైనా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పైనా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ‘ఫిదా’ ‘తొలి ప్రేమ’ సినిమాల తర్వాత విడుదల కాబోతున్న ‘అంతరిక్షం’ సక్సస్ గురించి తాను చాల టెన్షన్ పడుతున్నాను అంటూ ఆమూవీ సక్సస్ తన కెరియర్ కు చాల అవసరం అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. 
కథ నచ్చే చేశాను
తాను ఒకసినిమాను కథను నమ్ముకుని నటిస్తాను అని అంటూ అందరూ అనుకుంటున్నట్లుగా ఇదికేవలం సైన్స్ ఫిక్షన్ మూవీ కాదనీ ఈమూవీలో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న విషయాన్ని బయటపెట్టాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం లావణ్యా త్రిపాఠికి కొనసాగుతున్న ఫెయిల్యూర్ ట్రాక్ రికార్డును తాను పట్టించుకొననీ సినిమాల హిట్ విషయంలో తనకు సెంటిమెంట్స్ లేవు అన్న తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు ఈమెగా ప్రిన్స్.
మా అవసరం లేదనుకొంటాను
ఇదేసందర్భంలో చిరంజీవి పవన్ లతో తన సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ తన పెదనాన్న చిరంజీవితో అన్ని విషయాలు చనువుగా మాట్లాడలేనని ఇక పవన్ కళ్యాణ్ తో అయితే తన బాబాయ్ వైపు చూసి తిన్నగా మాట్లాడటమే తనకు భయం అంటూ కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం పవన్ నిర్వహిస్తున్న ‘ప్రజా పోరాట’ యాత్ర గురించి అదేవిధంగా ‘జనసేన’ గురించి మాట్లాడుతూ తన బాబాయ్ పవన్ తనకుటుంబ సభ్యులు అందర్నీ ‘జనసేన’ కు దూరంగా ఉంచుతున్నాడనీ అయితే పవన్ అలా ఎందుకు వ్యవహరిస్తున్నాడో తనకు తెలియదనీ అంటూ వివరించాడు.
వెంకటేష్‌ మా పెదనాన్న లాంటి వారు
అయితే పవన్ పిలిస్తే మాత్రం తాను పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తన బాబాయ్ కి సందేశాలు పంపుతున్నాడు వరుణ్ తేజ్. ఇదేసందర్భంలో రాబోతున్న సంక్రాంతికి విడుదలకాబోతున్న ‘ఎఫ్‌ 2’ మూవీ గురించి మాట్లాడుతూ వెంకటేష్ వయసులో తనకంటే చాల పెద్దవాడు అయినా తనతో చాలసరదాగా ఉన్న విషయాలను వివరిస్తూ ఇలాంటి చనువు తనకు చిరంజీవి పవన్ లతో తనకు లేదు అంటూ వరుణ్ తేజ్ తన ఫీలింగ్ ను షేర్ చేసుకున్నాడు. ఒక సీనియర్ నటుడుగా కాకుండా ఒక ఫ్రెండ్ గా వెంకటేష్ తనతో ప్రవర్తించిన తీరు తన జీవితంలో మరిచిపోలేను అంటూ వరుణ్ తేజ్ వెంకీని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. మెగా ప్రిన్స్ అభిప్రాయాలు తెలిసాయి కాబట్టి చిరంజీవి పవన్ లు వరుణ్ తేజ్ తో వ్యవహరించే తీరులో మార్పులు చేసుకుంటారేమో చూడాలి..     



మరింత సమాచారం తెలుసుకోండి: