1980వ దశాబ్దపు వాస్తవ ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘నేను కేరాఫ్‌ నువ్వు’. సాగా రెడ్డి తుమ్మా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కిషోర్, సానియా సిన్యా, బాషా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్‌ చేశారు.  ఇప్పుడు ఈ ట్రైలర్ చిక్కుల్లో పడింది.  'నేను కేరాఫ్‌ నువ్వు' అనే చిత్రం దళితబహుజనుల మనోభావాలను కించపరిచేలా ఉందని, ఈ సినిమాను నిషేదించాలని మధురవాడ జోన్‌1 అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ నాగేశ్వరరావుకు ఎస్‌సి, ఎస్‌టి ఐక్య వేదిక నాయకులు ఫిర్యాదు చేశారు.

 

ఈ సినిమా దేశ చట్టాలను, రాజ్యాంగాన్ని, అవహేళన చేస్తూ, సమాజంలో కింది కులాల వారు సిగ్గుతో తలదించుకునే విధంగా ట్రైలర్‌లో డైలాగులు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు దారులు  ఈ చిత్రంలో అసభ్యకర పదజాలంతో కింద కులాలను దూషిస్తూ, అభ్యంతకర భాషలను వాడటంతోపాటు, అగ్రకులాల మహిళలను ప్రేమించి పెళ్లి చేసుకున్న, దళిత బహుజన కులాల యువకులను క్రూరంగా హింసించి చంపమని రెచ్చగొట్టే విధంగా ఉందన్నారు. దర్శకుడిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ షాబాద్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. కులాల కుంపటిని రాజేసి, తెలుగు రాష్ట్రాల్లోని శాంతి వాతావరణాన్ని చెడగొట్టేలా ఇందులో మాటలున్నాయని ఆయన ఆరోపించారు.  ఈ సినిమాను నిషేదించి, దర్శకుడు సాగా రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Nenu C/O Nuvvu Movie Trailer Launch - Sakshi

కాగా, ఈ చిత్రం ట్రైలర్ లో "చదువులకు, ఉద్యోగాలకు మేము మీతో సమానం కాదని.. చదివి ఉద్యోగాలు తెచ్చుకునే వారు ప్రేమ, పెళ్ళి విషయానికి వచ్చేసరికి మనుషులంతా సమానమే అని ఎలాగంటారు?" అని ప్రశ్నించడం, "నిన్ను సుఖ పెట్ట‌డానికి మ‌నం కులం వాడు దొర‌క‌లేదా?" వంటి వివాదాస్పద డైలాగులు వినిపిస్తున్నాయి. ఇక దర్శకుడు మాట్లాడుతూ..ఇందులో డైలాగ్స్‌ చాలా బోల్డ్‌గా ఉంటాయి. వీటిని ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దని..ఎవరి మనోభావాలు ఇబ్బంది పెట్టడానికి నేను ట్రైలర్ రిలీజ్ చేయలేదని..అందరి అభీష్టం మేరకు ఈ ట్రైలర్ లో కొన్ని సీన్లు, డైలాగ్స్ డిలీట్ చేశానని అన్నారు.  మరి ఈ వివాదం ఎంత వరకు పోతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: