టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన సునీల్ ఆతరువాత హీరోగా మారి చేసిన ప్రయత్నాలతో రాణించలేకపోయాడు. దీనితో యూటర్న్ తీసుకుని తిరిగి తన కమెడియన్ స్థానాన్ని నిలుపుకుందామని సునీల్ ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. 

అయితే ఇప్పటికే వెన్నెలకిషోర్ ప్రియదర్శిని ప్రభాస్ శ్రీను పృధ్వీ లాంటి కమెడియన్స్ టాప్ కమెడియన్స్ గా మారిపోవడంతో తెలుగు సినిమాలలో సునీల్ కు స్థానం దొరకడం కష్టంగా మారిపోయింది. సునీల్ ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ‘అరవింద సమేత’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలలో సునీల్ పాత్రలు సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వకపోవడంతో చివరకు సునీల్ కు నిరాశ మాత్రమే మిగిలింది.
Sharwanand and Sai Pallavi are playing the leads in the film Padi Padi Leche Manasu directed by Hanu Raghavapudi.
ఇలాంటి పరిస్థుతులలో రేపు విడుదల కాబోతున్న ‘పడి పడి లేచె మనసు’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు సునీల్. ఈమూవీలో సునీల్ సాయి పల్లవితో కలిసి ఒక డాక్టర్ గా నటిస్తున్నాడు. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఈమూవీకి హైలెట్ గా మారుతాయి అని అంటున్నారు. 
The film directed by Hanu Raghavapudi, stars Sai Pallavi as its female lead. Its recently released song and teaser have also garnered a good response.
ప్రస్తుతం సాయి పల్లవి మ్యానియా కొనసాగుతున్న నేపధ్యంలో ఆమె మ్యానియా తనకు అదృష్టం కలిగిస్తుందని సునీల్ భావిస్తున్నాడు. ఈ మూవీ సక్సస్ శర్వానంద్ తో పాటు సునీల్ కు కూడ కీలకంగా మారింది. అయితే ఈ సినిమాలోని సునీల్ పాత్ర కూడ సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వకపోతే ఇక సునీల్ కామెడీ కెరియర్ కూడ ముగిసి పోయినట్లే అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: