ఆ అమ్మడి వయస్సు 21 ఏళ్లు.. కానీ ఆమె సంపాదన చూస్తే.. కళ్లు బైర్లు కమ్మక మానవు. ఆ అమ్మడి ఆస్తి ఇప్పటికే 6 వేల కోట్ల రూపాయలు దాటేసింది. ఆమే కెలీ జెన్నర్.. పదేళ్ల వయస్సులోనే బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ చిన్నది అతి చిన్న వయస్సులోనే వ్యాపార రంగంలో అడుగుపెట్టింది.



పదేళ్ల వయస్సులోనే కెలీ తన సొంత సౌందర్య సాధన పరికరాల సంస్థ కెలీ కాస్మటిక్స్ ను ప్రారంభించింది. ఆ తర్వాత 15 ఏళ్ల వయస్సులో ప్రముఖ వస్త్ర సంస్థ ప్యాక్ సన్ తో కొల్లాబరేట్ అయ్యింది. సోదరి కెండాల్ తో కలసి కెండాల్ అంటే కెలీ బ్రాండ్‌ ను నెలకొల్పింది.

Image result for Kylie Jenner


అలా ఒక్కో అడుగు వేస్తూ.. అటు టీవీ రంగంలోనూ..ఇటు వ్యాపార రంగంలోనూ దూసుకెళ్తోంది. ఇప్పుడు 21 ఏళ్ల వయస్సులో 900 మిలియన్ డాలర్ల ఆస్తి కూడబెట్టి చరిత్ర సృష్టించింది.

Image result for Kylie Jenner

అమెరికాలోని సెలబ్రెటీల్లోని అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకుంది. అంతే కాదు.. అమెరికన్ వుమెన్ బిలియనీర్స్ ఎడిషన్‌ కవర్ పేజీని అలంకరించింది కెలీ.. గ్రేట్ కదూ..


మరింత సమాచారం తెలుసుకోండి: