ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన రెండవ భాగం ‘మహానాయకుడు’ విడుదల డేట్ ను హడావిడిగా ప్రకటిస్తూ ఫిబ్రవరి 9న ఈమూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు. ఎలక్షన్ కమీషన్ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరిలో విడుదల అవుతుంది అని నీకులు వస్తున్న నేపధ్యంలో ఈమూవీకి సబంధించి వ్యూహాత్మకంగా బాలకృష్ణ క్రిష్ లు ఇలా తొందరపడి ప్రకటన ఇచ్చినట్లు సమాచారం. 

దీనితో ఇదే డేట్ ను టార్గెట్ చేస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితానికి సంబంధించిన బయోపిక్ ‘యాత్ర’ పరిస్థితి ఏమిటి అన్న కోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈమూవీ నిర్మాతలు కూడ ఇప్పటికే తమ మూవీ రిలీజ్ డేట్ ను ఫిబ్రవరి 9గా ఫిక్స్ చేసారు.   ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఏప్రియల్ లో ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ‘యాత్ర’ ఇమేజ్ బాగా కలిసి వస్తుందని ఇప్పటికే ఈ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. 

అయితే ఇప్పుడు ఒకే రోజున రెండు బయోపిక్ ల రిలీజ్ వార్ జరగబోతూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా సంక్రాంతి పండుగకు ఒక టాప్ హీరో సినిమాకు పోటీగా మరో టాప్ హీరో సినిమాను విడుదల చేస్తారు. అయితే దీనికి భిన్నంగా ఎప్పుడో చనిపోయి ఇప్పటికీ ప్రజల గుండెలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఆత్మలు తమ బయోపిక్ సినిమాల రూపంలో పోటీ పడటం అత్యంత ఆశ్చర్య కరంగా మారింది. 

ఈ రెండు బయోపిక్స్ పై బాలకృష్ణ అదేవిధంగా జగన్ చాల ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే వీరిద్దరి పార్టీల మధ్య తీవ్రమైన ద్వేషాలు ఉన్న నేపధ్యంలో ఈ రెండు బయోపిక్స్ లో ఏఒక్కటి పరాజయం చెందినా ఆ పరాజయ ప్రభావం వీరిద్దరి పొలిటికల్ కేరియర్స్ పై పడుతుంది. దీనితో ఫిబ్రవరి 8న జరగబోతున్న ఈ బయోపిక్స్ రిలీజ్ వార్ ఫలితం గురించి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: