చిరంజీవి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజులలో ఒకేగదిలో నారాయణరావు సుధాకర్ హరిప్రసాద్ ప్రసాద్ బాబులు కలిసి ఉన్న విషయం ఈనాటి తరానికి తెలియకపోయినా చిరంజీవి వ్యక్తిగత జీవితం దగ్గర నుండి పరిశీలించిన చాలామందికి తెలిసిన విషయం. ఇలాంటి సందర్భంలో అలనాటి చిరంజీవి ఆప్తమిత్రుడు నటుడు నారాయణరావు ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలనాటి విషయాలను గుర్తుకు చేసుకుంటూ అనేక ఆసక్తికర విషయాలను వివరించాడు. అంతేకాదు చిరంజీవిలోని ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ను సవివరంగా ప్రస్తావించాడు.
అప్పుడున్నట్లే ఇప్పుడే ఉండాలని లేదు
చిరంజీవితో కలిసి తాను ప్రసాద్ బాబు సుధాకర్ హరిప్రసాద్ ఒక గ్యాంగ్ లా గడిపిన ఆరోజులను గుర్తుకు చేసుకుంటూ చిరంజీవి కెరియర్ లో ఓవర్ లోడ్ అయిపోవడంతో తన స్నేహితులను కొంతవరకు మరిచిపోయి ఉండవచ్చు అన్నఅభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు నారాయణరావు. ఒకప్పుడు బాగా కలిసి ఉన్న మిత్రులు బాగా పెద్దఅయ్యాక అలాగే కలిసి ఉండాలని అనుకోవడం దురాశ అవుతుంది అంటూ ఎవరి కుటుంబాలు వారికి ఏర్పడ్డాక ఎవరి కష్టాలు వారికి ఏర్పడి ఈకాంపిటీషన్ ప్రపంచంలో ఒకనాటి మిత్రులు తిరిగి కలుసుకోవడం చాల అరుదుగా జరుగుతున్న సందర్భం అంటూ కామెంట్స్ చేసాడు. అయితే తమ నలుగురులో ఒకరు పీక్స్ కు వెళ్లిపోయి మెగా స్టార్ గా మారిపోయినా తాము అంతా ఆనందపడ్డామే కాని ఏనాడు జలసి ఫీల్ అవలేదు అంటూ చిరంజీవికి ఏర్పడ్డ క్రేజ్ పై  తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 
చిరంజీవి ఓవల్ లోడ్ అయిపోయాడు
అంతేకాదు చిరంజీవి స్థాయిలో తాము అంతా ఎదగలేకపోయిన విషయం పై స్పందిస్తూ మన సోల్ పై నుంచి భూమికి వచ్చేడప్పుడే మనం ఏం కావాలో డిసైడ్ చేసుకుని వస్తుందని తల్లి తండ్రిని కూడా ఎంపిక చేసుకుని వాళ్లకే పుట్టాలని డిసైట్ చేసుకుంటుందని అభిప్రాయపడ్డాడు నారాయణరావు. అంతేకాదు ఏవిషయం మనచేతులలో ఉండదనీ జరిగిపోయిన దాన్ని గురించి ఫీల్ అవుతూ కాలం గడిపేకన్నా వచ్చే జన్మలో మనకోరిక తీరాలని గట్టిగా తలచుకుంటే ఆకోరికలు తీరుతాయి అంటూ ఆసక్తికర విషయాలను చెప్పాడు నారాయణరావు. 
మేమంతా ఒక గ్యాంగ్
ఇక చిరంజీవి హార్డ్ వర్క్ గురించి మాట్లాడుతూ కెరియర్ మొదటి నుండి పెద్దపెద్ద లక్ష్యాలతో చిరంజీవి తన సినీ కెరియర్ ను కొనసాగించాడని అదే అతడి గ్రేటెస్ట్ క్వాలిటీ అంటూ అయితే చిరంజీవిలోని చిరుకోపం తగ్గించుకుంటే అతడు రాజకీయాలలో కూడ బాగా రాణిస్తాడని అంటూ చిరంజీవి పొలిటికల్ కెరియర్ పై కామెంట్ చేసాడు. అయితే చిరంజీవి రాజకీయాలలో కంటే సామాజిక సేవలో బాగా రాణించి ఉండేవాడనీ చిరంజీవి మనస్తత్వానికి రాజకీయాలు సరిపోవు అంటూ నారాయణరావు తన అభిప్రాన్ని నిర్మొహమాటంగా వెల్లడించాడు. చెన్నైలోని ఒకే రూమ్ లో కలిసి ఉన్న ఈమిత్రుల పేర్లు ప్రస్తుతం చాలామంది మరిచిపోయినా ఆమీడియా సంస్థ నారాయణరావు చేత అలనాటి విషయాలను ఈనాటి తరానికి గుర్తుకు చేయడానికి ప్రయత్నిస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: