తెలుగు ఇండస్ట్రీలో మహానటులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అంటే ఎంతో అభిమానం.  ఆయన నటించిన చిత్రాలు తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం గుర్తు చేసుకునే విధంగా ఉంటాయి.  సాంఘిక,పౌరాణిక, జానపద చిత్రాల్లో ఆయన పాత్రలు చెరగని ముద్ర వేశాయి.  రాముడు, శ్రీకృష్ణుడు పాత్రలో ఎన్టీఆర్ నటిస్తే..నిజంగా ఆ దేవుడు ఇలాగే ఉండేవారేమో అని ప్రేక్షకులు అనుకునే వారట..అంతే కాదు ఇప్పటికీ ఆ వేషధారణలో ఉన్న చిత్రాపటాలు దర్శనమిస్తూనే ఉంటాయి. 
Image result for ntr biopic posters
ఇక రావణ బ్రహ్మగా ఎన్టీఆర్ విశ్వరూపం చూస్తే..కళ్లు చెదిరిపోవాల్సిందే.  ఏ పాత్రలో అయినా ఆ మహానటులు ఇట్టే ఒదిగిపోయేవారు.  ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు..ఎన్టీఆర్ నట జీవితంలోకి ఎలా వచ్చారు..తర్వాతా రాజకీయాల్లోకి ఎలా వెళ్లారు అన్న విషయాన్ని సంపూర్ణంగా చూపించబోతున్నారు. అయితే ఎన్టీఆర్ నట జీవితానికి సంబంధించిన మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’.
Image result for ntr biopic posters
రాజకీయ నేపథ్యంలో వచ్చే చిత్రం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’. ఇక ఎన్టీర్ కథానాయకుడు లో ఆయన పాత్రలు, సూపర్ హిట్ సాంగ్స్ అద్భుతమైన సన్నివేశాలతో ఆకట్టుకోబోతున్నారట.  రేపు ‘ఎన్టీఆర్’ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్ లో జరగబోతుంది. నందమూరి అభిమానులను మరింత సంతోషపెట్టేలా బాలకృష్ణ రావణుడి పోస్టర్ విడుద‌ల చేశారు ఎన్టీఆర్ చిత్ర బృందం. ఆ పోస్ట‌ర్ చూసిన వారు నిజంగా ఎన్టీఆర్ మరోసారి తమ కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నారా అన్నంత గొప్పగా ఉంది పోస్టర్.   
Related image
రావణుడిలోని రాజసం, ఆ బాడీలాంగ్వేజ్, కాస్ట్యూమ్స్ అన్ని కూడా అద్బుతంగా సెట్ అయ్యాయంటూ అభిమానులు తెలిపారు. సంక్రాంతికి ఎన్టీఆర్ కథానాయకుడు రాబోతున్నాడు. అందులో దాదాపుగా 25 గెటప్స్ లో బాలయ్య కనిపిస్తాడని సినీ వర్గాల సమాచారం. నందమూరి ఫ్యాన్స్ కు కన్నుళ పండుగే అనేందుకు ఈ పోస్టర్ సాక్ష్యంగా నిలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: