యాంగ్రీ హీరోగా కొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక హిట్స్ ఇచ్చిన రాజశేఖర్ ఆతరువాత తన ప్రాభవం అంతా కోల్పోయి కనీసం సినిమాలు కూడ లేని పరిస్థుతులకు చేరుకున్నాడు. అయితే చాల గ్యాప్ తరువాత రాజశేఖర్ తన ‘గరుడవేగా’ మూవీతో తిరిగి తనకు సినిమాలను హిట్ చేయగల సామర్ధ్యం ఉంది అంటూ మరొకసారి నిరూపించుకున్నాడు. అయితే ‘గరుడవేగ’ హిట్ అయినా అతడికి కోరుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. దీనితో మళ్ళీ గ్యాప్ ఏర్పడింది. 

అయితే అనేక ఆలోచనలు చేసిన తరువాత రాజశేఖర్ ప్రస్తుతం ‘కల్కి’ అన్న మూవీలో నటిస్తున్నాడు. నాని నిర్మించిన 'అ' ఫేం యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈమూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ షూటింగ్ సమయంలో రాజశేఖర్ కు దర్శకుడు ప్రశాంత వర్మకు మధ్య విభేదాలు వచ్చినట్లు ఇండస్ట్రీలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

ఈమూవీ షూటింగ్ సమయంలో రాజశేఖర్ ఈమూవీ దర్శకుడుని చాల ఇబ్బంది పెడుతున్నాడని ఈసినిమాకు సంబంధించి సీన్స్ షూట్ చేసే సమయంలో రాజశేఖర్ ప్రశాంత్ వర్మ చెప్పినట్లు వినడం లేదన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఈమూవీ షూటింగ్ సమయంలో రాజశేఖర్ తాను సీనియర్ హీరో అన్న అహం చూపెడుతున్నాడని దర్శకుడికి నచ్చిన విధంగా కాకుండా తనకు నచ్చిన విధంగా నటిస్తూ ఆదర్శకుడుకి చుక్కలు చూపెడుతున్నాడని టాక్. 

దీనితో సెట్స్‌ లో రాజశేఖర్ ప్రవర్తనతో విసుగు చెందుతున్న ప్రశాంత్ వర్మ ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నాడని తన బాధ అంతా ఇండస్ట్రీలోని స్నేహితులకు చెప్పుకుని బాధపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈవార్తలు ఇలా వైరల్ కావడంతో రంగంలోకి దిగిన ప్రశాంత్ వర్మ ఈ గాసిప్పులను ఎవరో కావాలని ప్రచారం చేస్తున్నారని రాజశేఖర్ తాను ఎలా చెపితే అలా నటిస్తూ తనకు సహకరిస్తున్నాడు అంటూ లీకులు ఇస్తున్నాడు. అయితే రాజశేఖర్ అహం గురించి తెలిసిన చాలామంది ఈ గాసిప్పులలో ఎంతోకొంత నిజం ఉండి ఉంటుందని అంటూ కామెంట్స్ చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: