ఆమె అచ్చమైన తెలుగు అమ్మాయి. అయితే అవకాశాలు మాత్రం అంత తేలిగ్గా రాలేదు. మొత్తానికి ఓ క్లీన్ హిట్ సాధించి నేనూ ఉన్నాననిపించుకుంది. ఆమె ప్రియ వడ్లమాని. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, రియాల్ నిర్మించిన హుషారు  మూవీ మంచి టాక్ తెచ్చుకోవడంతో కెరీర్‌పై మంచి హుషారుతో ఉంది హీరోయిన్ ప్రియావడ్లమాని. ఇకపై మంచి మూవీస్  చేస్తానని మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్న ప్రియ ఇపుడు టాలీవుడ్ కి దొరికిన కొత్త తెలుగు అందం.


‘హుషారు’ సక్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేయాలో కూడా తెలీడంలేదు అంటోంది ప్రియ. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ టెన్షన్ పడేదాని ఈ సినిమా హిట్ తో ఆ  భయం పోయిందని హ్యాపీగా నవ్వేస్తోంది ప్రియ. క్లాసికల్ డాన్స్ 12 ఏళ్లు నేర్చుకున్న ప్రియ . కెరీర్ మొదట్లోనే క్యూట్ ప్రేమకథలో నటించడం, పూర్తిగా యూత్ నేపథ్యంలో సినిమా చేయడం హ్యాపీగా ఉందంటోంది. ఈ నెలోనే వచ్చిన తన మరో చిత్రం  శుభలేఖలు సినిమా పూర్తిస్థాయిగా ఫ్యామిలీ సినిమా అయితే అందులో సిగరెట్ తాగే సన్నివేశాలు పాత్ర డిమాండ్ మేరకే చేశానని, దాన్ని నెగిటివ్ చేయవద్దంటోంది ప్రియ. 


తాను పక్కా తెలుగమ్మాయినని, టెన్త్, ఇంటర్ హైదరాబాద్‌లో చదివాను. బిటెక్ బెంగుళూరులో చేశానని చెప్తోంది.  తనది మధ్యతరగతి ఫ్యామిలీట. నాకు దర్శకురాలు అవ్వాలన్న ఆలోచనతో పరిశ్రమకు వచ్చానని,  వంశీ పైడిపల్లి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. మహర్షి సినిమాకు పనిచేశాను. అదే సమయంలో ‘హుషారు’ ఛాన్స్ వచ్చిందని వివరించింది.  దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఓకె చెప్పాను. తరువాత వెంటనే శుభలేఖలు, మరో సినిమా చేశా. ఈ సినిమాలో లిప్‌లాక్ కూడా వుంది. కథ ప్రకారమే అందులో ముద్దు సన్నివేశం ఉంటుంది కాబట్టి చేశానని చెబుతోంది.


ఇక నటిగా భిన్నమైన పాత్రలు పోషించాలని ఉంది. తెలుగులో అమ్మాయిలకు ఛాన్సులు రావన్న అపవాదు నిజమే. ఎందుకంటే తెలుగు అమ్మాయి అయినందుకు నాకు కొన్ని అవకాశాలు పోయాయి. అయితే ఇక్కడ టాలెంట్ వుంటే మంచి అవకాశాలు వస్తాయని నాలాంటి వాళ్లం ప్రూవ్ చేస్తున్నామని చెబుతున్న ప్రియ ప్రస్తుతం   ఓ ప్రాజెక్టు చర్చల్లో వుంది. త్వరలోనే దాని గురించి తెలియజేస్తానంటోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: