టాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ ల జోరు కొనసాగుతుంది.  ఈ సంవత్సరం స్టార్ హీరో, చిన్న హీరోలు వరుస విజయాలు అందుకుంటున్నారు.  ఒక రకంగా చెప్పాంటే ఈ సంవత్సరం టాలీవుడ్ లో సినిమాలు హిట్ కావడమే కాదు..మంచి కలెక్షన్లు కూడా రాబడుతున్నాయి.  స్టార్ హీరోలు నటించిన భరత్ అనే నేను, రంగస్థలం, అరవింద సమేత సినిమాలతో పాటు మహానటి, ఆర్ ఎక్స్ 100, గీతా గోవిందం, టాక్సీవాలా లాంటి సినిమా మంచి హిట్ అయి మంచి వసూళ్లు సాధించాయి.  ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా ‘ఎన్టీఆర్’బయోపిక్ సినిమా రాబోతుంది. 

ఒకప్పుడు బాలకృష్ణకు గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి హిట్ సినిమా అందించిన క్రిష్ మరోసారి ‘ఎన్టీఆర్’బయోపిక్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ రక రకాల గెటప్స్ లో కనిపించబోతున్నారట.  ఎన్టీఆర్ నటనా జీవితంపై ఎన్టీఆర్ కథానాయకుడు, రాజకీయ జీవితంపై ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు రాబోతున్న విషయం తెలిసిందే.  రేపు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఆడియో వేడుక జరగబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పోస్టర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 

తాజాగా  ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ  .. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ వున్న పోస్టర్ ను విడుదల చేశారు. బసవతారకం హార్మోనియం వాయిస్తూ వుంటే, ఆ పక్కనే ఎన్టీఆర్ కూర్చుని ఆమె కళ్లలోకి చూస్తున్నట్టుగా వున్న ఈ పోస్టర్, ఎన్టీఆర్ .. బసవతారకం దంపతుల మధ్యగల అనుబంధానికి అద్దం పడుతోంది.  ఎన్టీఆర్ సినీ పరిశ్రమలో ఎంత గొప్ప వారైనా..తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ద వహించేవారని టాక్.
Image result for ntr biopic
ఇక బసవతారకం పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయినట్టుగా అనిపిస్తోంది.  ఈ సినిమా ఆడియో వేడుకను హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ఆరంభం కానుంది.   'కథానాయకుడు' జనవరి 9వ తేదీన .. రెండవ భాగమైన 'మహానాయకుడు' ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా కు సంబంధించిన ట్రైలర్ క్రిష్ ఏ రేంజ్ లో కట్ చేయబోతున్నాడో అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: