ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ ఆడియో ఫంక్షన్ ఈరోజు అత్యంత ఘనంగా జరగబోతున్న నేపధ్యంలో ఎవరూ ఊహించని విధంగా వివాదాస్పద దర్శకుడు రామ్ రామ్ గోపాల్ వర్మ బాలకృష్ణకు ఊహించని వెన్నుపోటు పొడిచాడు. వర్మ దర్శకత్వంలో నిర్మింపబడుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీలోని ‘వెన్నుపోటు’ పాట ఫస్ట్ లుక్‌ ని ఈరోజు సాయంతం 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. 
Lakshmi`s NTR
ఈవిషయాన్ని తెలియచేస్తూ వర్మ చేసిన ట్విట్ పై ఒక రేంజ్ లో జోక్స్ పేలుతున్నాయి. కొందరైతే ఇది బాలయ్యకు ఊహించని వెన్నుపోటు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా లక్ష్మీ పార్వతి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఈమూవీలో యదార్ధ సంఘటనలు అన్నీ యధాతధంగా ఉంటాయి అని చెప్పడమే కాకుండా తాను ఎన్టీఆర్ పై రాసిన పుస్తకంలోని కొన్ని వాస్తవాలు ఏమార్పులు లేకుండా వర్మ తీస్తున్నాడు అని సంకేతాలు ఇవ్వడం మరింత సంచలనంగా మారింది.  
Ram Gopal Varma Makes Lakshmi's NTR Movie
దీనికితోడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాల రొటీన్ కు భిన్నంగా ఈమూవీలో ఏకంగా 8పాటలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈపాటలు అన్నీ కూడ చాల భావయుక్తంగా ఎన్టీఆర్ లక్షీ పార్వతిల మధ్య ఏర్పడిన ప్రేమను హైలెట్ చేస్తూ ఉంటాయని తెలుస్తోంది. కళ్యాణ్ మాలిక్ సంగీతం సమకూరుస్తున్న ఈమూవీ ట్యూన్స్ బాగా వచ్చాయని తెలుస్తోంది. 
Ram Gopal Verma sensational Facebook Status on Lakshmis NTR movie
ఈ ఎనిమిది పాటలు కూడా రెగ్యులర్ మాస్ సాంగ్ లా కాకుండా చాలా క్లాసికల్ గా ఉంటాయట. పెద్ద పెద్ద డ్రమ్స్ బీట్లు లేకుండా ఈ పాటలు కొనసాగుతాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలోని ప్రతి పాట కూడా సందర్బానుసారంగా వచ్చే విధంగా వర్మ ప్లాన్ చేసాడని తెలుస్తోంది. అంతా కొత్త వారే నటిస్తున్న ఈమూవీ షూటింగ్ చాల వేగంగా ప్రస్తుతం ఎవరికీ తెలియకుండా ముంబాయ్ లో జరుగుతోంది. ఈవార్తలను బట్టి చూస్తుంటే వర్మ బాలయ్యకు ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడు అన్నది వాస్తవం..   


మరింత సమాచారం తెలుసుకోండి: