ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్ ఇంకా పూర్తి కాకుండానే అనేక వివాదాలకు కేంద్రంగా  మారబోతోంది.  ఈరోజు  హైదరాబాద్ ఫిలింనగర్‌ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో జరిగే కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఈరోజు సాయంత్రం జరిగే ఈ ఫంక్షన్ కు సంబంధించి ఈసినిమా యూనిట్ విడుదల చేసిన ప్రకటనలో ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది పేర్లు ఉన్నప్పటికీ ఆ పేర్ల లిస్టులో చిరంజీవి పేరు లేకపోవడం మెగా అభిమానులకు అసహనాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు
 ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరితో పాటు ఎన్టీఆర్ తో కలిసి నటించిన  అలనాటి సీనియర్ హీరోలు అంతా హాజరవుతున్నారు’ ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ  రెబెల్‌స్టార్ కృష్ణంరాజు మోహన్‌ బాబులతో పాటు జమున గీతాంజలి ఇంకా చాలామంది అలనాటి ప్రముఖులు నటులు వస్తున్నారు. వీరందరినీ బాలకృష్ణ స్వయంగా పిలిచినట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ తో చిరంజీవి కొన్ని సినిమాలలో కలిసి నటించినా చిరంజీవి సినిమా ఫంక్షన్స్ కు ఎన్టీఆర్ జీవించి ఉన్న కాలంలో అతిధిగా వచ్చిన సందర్భాలు ఉన్నా అవి ఏమీ పరిగణలోకి తీసుకోకుండా ఆహ్వానితుల లిస్టులో చిరంజీవి పేరు లేకపోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 
నటీనటులు, సాంకేతికవర్గం
ఇప్పటికే ఈ కార్యక్రమానికి దూరంగా జూనియర్ ఉంటున్నాడు అని వార్తలు వచ్చిన పరిస్థుతులలో ఇప్పుడు చిరంజీవిని కూడ దూరం పెట్టడంతో ఈమూవీ ఆడియో ఫంక్షన్ అనేక వివాదాలకు తావు ఇస్తోంది. ఈరోజు సాయంత్రం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రారంభం కాబోతున్న ఈ ఫంక్షన్ లైవ్ కార్యక్రమాన్ని అన్ని ప్రముఖ ఛానల్స్ ప్రసారం చేయబోతున్నాయి. 
కృష్ణ, కృష్ణంరాజు, మోహన్‌బాబు తదితరులు
ఫిలిం ఇండస్ట్రీలో నందమూరి కుటుంబ ఆధిపత్యం నిరూపించేలా జరపబడుతున్న ఈ మూవీ ఫంక్షన్ విషయాలు మీడియాకు హాట్ టాపిక్ గా మారబోతున్నాయి. ఇప్పటికే ఈమూవీలోని పాటలకు మంచి స్పందన వస్తున్న నేపధ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ తన మొదటి పరీక్షలో నెగ్గినట్లే అని అంటున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: