రాజమౌళి దర్శకత్వంలో అవకాసం వస్తే చాలు అని చాలామంది భావిస్తూ ఉంటే ఇంకా రాజమౌళి తన నిర్ణయం పూర్తిగా తెలియచేయకుండానే రాజమౌళి ఆఫర్ ను పక్కకు నెట్టేసిన కీర్తి సురేశ్ వ్యవహారశైలి ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘మహానటి’ మూవీ తరువాత తెలుగులో అవకాశాల కోసం కీర్తి సురేశ్ పెద్దగా ప్రయత్నించకుండా తన దృష్టి అంతా కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పైన పెట్టింది. ఆమెకు అక్కడ లెక్కలేనన్ని అవకాశాలు వస్తున్న నేపధ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ విషయాలను మరిచిపోయింది కీర్తి సురేశ్. 
రజనీకాంత్ మూవీ వైపే...
ఇలాంటి పరిస్థుతులలో రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేశ్ ఎంపిక అయింది అన్న వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఈవిషయమై రాజమౌళి టీమ్ సభ్యులతో కీర్తి సురేశ్ మంతనాలు జరిగినట్లు కూడ సమాచారం. అయితే రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ హీరోయిన్స్ ఎంపికలో రకరకాల ఈక్వేషన్స్ పరిశీలిస్తూ తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. 
 రొమాంటిక్ సాంగ్స్, సీన్లకు దూరంగా రజనీకాంత్
జనవరి నుండి మురగదాస్ రజినీకాంత్ తో తీయబోతున్న ఒక పొలిటికల్ మూవీలో తనకు వచ్చిన హీరోయిన్ అవకాశాన్ని రాజమౌళి పిలుపు గురించి వేచి చూడకుండా వెంటనే ఒప్పుకున్నట్లు టాక్. కీర్తి సురేశ్ ఇప్పటికే మురగదాస్ దర్శకత్వంలో ‘సర్కార్’ మూవీలో నటించిన నేపధ్యంలో కీర్తి పట్ల మురగదాస్ కు ప్రత్యేకమైన అభిమానం ఉన్నట్లు తెలుస్తోంది. 
ఎలాంటి సినిమా ఇది?
దీనికితోడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటించాలి అన్నది కీర్తి డ్రీమ్ కావడంతో ఆమె రాజమౌళి ఆఫర్ ను వదులుకున్నట్లు సమాచారం. అయితే రజినీకాంత్ కు ఆరోగ్యం పాడైన దగ్గర నుండి తన సినిమాలలో హీరోయిన్స్ తో పాటలు పాడుతూ స్టెప్స్ వేసే సీన్స్ కు అంగీకరించడం లేదని సమాచారం. దీనితో గ్లామర్ బ్యూటీ కీర్తి సురేశ్ ను మురగదాస్ తన సినిమాలో ఎలా చూపిస్తాడు అన్న ఆసక్తి ఫిలిం ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఉంది..    



మరింత సమాచారం తెలుసుకోండి: