మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల నెక్స్ట్‌ ఏంటి అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రొటీన్ కు భిన్నమైన స్టోరీ చేసింది తమన్నా.. మారుతున్న కాలానికి అనుగుణంగా లివిన్ రిలేషన్‌ షిప్‌, అబ్బాయి, అమ్మాల మధ్య ఫ్రెండ్‌షిప్ వంటి విషయాలను ఈ సినిమాలో బోల్డ్ గా డిస్కస్ చేశారు.

Related image

ఇంత డేరింగ్ గా సినిమా తీసినా ఫలితం మాత్రం అంత ఆశాజనకంగా లేదు. రిజల్ట్ సంగతి పక్కకు పెడితే ఈ సినిమా డైరెక్టర్ కునాల‌్ పై మాత్రం తమన్నా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ డైరెక్టర్‌లో ఏదో మ్యాజిక్ కనిపించిందంటూ తెగ మెచ్చుకుంటోంది.

Image result for NEXT ENTI TAMANNA


సాధారణంగా ఏదైనా సీన్ చిత్రీకరించేటప్పుడు ఎప్పడు దర్శకుడు కట్ చెప్పేస్తాడా అని యాక్టర్స్ ఎదురుచూడటం అలవాటు. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలో మాత్రం దర్శకుడు కట్ చెప్పకుండా ఉంటే బావుంటుందని చాలా సార్లు అనిపించిందట తమన్నాకు.

Image result for NEXT ENTI TAMANNA


ఈ సినిమా దర్శకుడే కాదు.. సినిమా కూడా తమన్నాకు తెగ నచ్చేసిందట. అందుకే ఈ సినిమాలో తన క్యారెక్టర్‌కు టామ్ అని తన ముద్దు పేరే పెట్టమని దర్శకుడిని కోరిందట తమన్నా. కానీ పాపం.. తమన్నా అంతగా ఇష్టపడినా ఆ సినిమా మాత్రం అంతగా ఆడినట్టు కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: