ప్రియా వారియార్ కన్ను కొట్టి మరీ సిల్వర్ స్క్రీన్ ని తన వైపునకు తిప్పుకున్న అల్లరి చిన్నది. ఈ కేరళ కుట్టి సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఎన్నో ఆఫర్లు వెల్లువగా వచ్చిన నో చెబుతూ తాను అనుకున్న ప్రాజెక్ట్ నే చేస్తూ వస్తున్న ప్రియ కళ్ళతోనే ఫిదా చేస్తుంది. ఆ కంటి చూపు ఒక్కటి చాలు అనిపించేలా సమ్మోహనం ఆమె సొంతం.


వింక్ సెనే్సషన్ ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం ఒక హిందీ సినిమాలో నటిస్తోంది. శ్రీదేవి బంగ్లా అనే టైటిల్‌తో రానున్న ఈ చిత్రంలో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘్భగవాన్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ మాబుల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.


 ఈ చిత్రంలో ప్రభుదేవా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇదిలా వుంటే ప్రియా ప్రకాష్ మలయాళంలో నటించిన మొదటి చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’ ఎపుడో విడుదల కావాల్సి వుండగా, అనివార్య కారణాలతో వాయిదా పడి వచ్చే ఏడాది ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీ కనుక హిట్ అయితే ప్రియ కు బాలీవుడ్ కన్ను కొట్టడం ఖాయం అంటున్నారు. దాంతో పాటే ప్రియ కూడా భారత నాయికగా అవతరిస్తుందని అంటున్నారు. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: