‘పడి పడి లేచె మనసు’ ఈరోజు విడుదల అయినప్పటికీ అల్లు అర్జున్ ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ పై సెటైర్లు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. సాధారణంగా టాప్ హీరోలు చెప్పిన మాటలను సాధారణ ప్రజలు చాల పాజిటివ్ గా తీసుకుంటారు. 
Naa Peru Surya 2 Days Worldwide box office collection: Allu Arjun film earns Rs 63.86 Cr
అయితే దీనికి భిన్నంగా అల్లు అర్జున్ విషయంలో సీన్ రివర్స్ అయి రోజురోజుకు బన్నీ పై మాటల దాడి పెరిగిపోతోంది. అంతేకాదు బన్నీ చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదంటూ రివర్స్ ఎటాక్ చేయడమే కాకుండా అల్లు అర్జున్ ను కార్నర్ చేస్తూ కొన్ని ఫోటోలను కూడ సోషల్ మీడియాలో పెడుతున్నారు. 
buyers shocked with allu arjun naa peru surya naa illu india
ప్రస్తుతం బన్నీ అందర్నీ ‘గారు’ అంటూ పిలవమని సందేశాలు ఇస్తున్న నేపధ్యంలో గతంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పేరు వెనుక ‘గారు’ పెట్టకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు ఈ విషయానికి సంబంధించిన  స్క్రీన్ షాట్ తీసి పెట్టి ఇదేనా బన్నీ నీసంస్కారం అంటూ ప్రశ్నిస్తున్నారు. 
Naa Peru Surya Early Morning Shows in Hyderabad
మరోవైపు ఒక ఫంక్షన్ లో దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ పక్కన కాలు మీద కాలేసుకుని పొగురుగా కూర్చున్న అల్లు అర్జున్ ఫోటోను షేర్ చేస్తూ ఇలాంటి విషయాలలో బన్నీ సంస్కారం ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులు చూస్తూ ఉంటే అల్లు అర్జున్ భవిష్యత్ లో పాల్గొనబోయే ఫిలిం ఫంక్షన్స్ లో కాస్త అత్యుత్సాహం తగ్గించుకుని చాల జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ ఈ స్టైలిష్ స్టార్ దృష్టి వరకు వెళితే రానున్న రోజులలో ఈ హీరోకు ఇలాంటి తల నొప్పులు ఉండవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   





మరింత సమాచారం తెలుసుకోండి: