వరుస సినిమాలతో బిజీగా ఉన్న కాజల్‌.. డేటింగ్‌లోనూ బిజీగా ఉందా.. అవునంటోంది ఓ ఫోటో.. ఈ ఫోటో ఎక్కడిదో కాదు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నదే. అవును.. ఓ వ్యక్తితో ఐస్‌ క్రీమ్ షేర్ చేసుకుంటూ కాజల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో కలకలం సృష్టిస్తోంది.

Related image

ఆ ఫోటోలోని అపరిచిత వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న ఎంగ్జయిటీ ఫ్యాన్స్ లో పెరిగిపోతోంది. ఈ ఫోటో ఆ వ్యక్తి ముఖం కనిపించకుండా కేవలం చేతులు, ఐస్‌ క్రీమ్ మాత్రమే కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంది కాజల్. ఈ ఫోటో చూస్తుంటో ఆ వ్యక్తి తన బర్త్‌డే కాజల్ సమక్షంలో జరుపుకున్నట్టు కనిపిస్తోంది.



అంతే కాదండోయ్.. కాజల్ తన పోస్టులో అతడిని మోస్ట్ ఫేవరేట్, అండ్ మోస్ట్ ఎమేజింగ్ పర్సన్ అని తన ఫ్యాన్స్ కు ఇంట్రడ్యూస్ చేసింది. ద మోస్ట్ ఫావరేట్ పర్సన్‌కు హ్యాపీ బర్త్ డే.. అంటూ విషెష్ చెప్పేసింది. మరి కాజల్ అంత స్పెషల్ గా చెబుతున్న ఆ మోస్ట్‌ ఫేవరేట్ పర్సన్ ఎవరో అర్థంకాక ఫ్యాన్స్ జుట్టుపీక్కుంటున్నారు.



మరి కాజల్ ఎప్పుడు ఈ సస్పెన్స్ కు తెరదించుతుందో.. ఇదంతా నిజమేనా.. లేక ఆటపట్టించే వ్యవహారమా.. ఏదేమైనా ఈ మిస్టరీ విప్పాల్సింది మాత్రమే కాజలే. అన్నట్టు కాజల్ తమిళ్‌ సినిమా పారిస్ పారిస్ త్వరలో విడుదల కాబోతోంది. హిందీ క్వీన్ చిత్రానికి ఇది రీమేక్. అలాగే.. శంకర్ తీయబోతున్న ఇండియన్ 2 సినిమాలోనూ కాజల్ ఛాన్స్ కొట్టేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: