వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకే జోనర్ లో సినిమాలు చేయకుండా వరుణ్ వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటున్నాడు. ఘాజితో సరికొత్త అనుభూతిని అందించిన సంకల్ప్ రెడ్డి అంతరిక్షం చిత్రంతో మరో ప్రయోగం చేస్తున్నాడు. ట్రైలర్ సినిమాపై విపరీతమైన ఆసక్తిని పెంచింది. టాలీవుడ్ లో వస్తున్న తొలి స్పేస్ థ్రిల్లర్ కావడంతో ఉత్కంఠ నెలకొని ఉంది.

Image result for anthariksham telugu

లావణ్య త్రిపాఠి, అదితి రావు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందొ చూద్దాం. వరుణ్ తేజ్ అంతరిక్షం చాలా బావుంది. తెలుగు సినిమా మెరుపులు మెరిపించేలా దూసుకుపోతోంది. అంతరిక్షం చిత్రానికి యుఎస్ నుంచి అదిరిపోయే రిపోర్ట్స్ వస్తున్నాయి. సంకల్ప్ మరో థ్రిల్లర్ తో అదరగొట్టాడు. వరుణ్ తేజ్ కు ఇది హ్యాట్రిక్ విజయం. అంతరిక్షం చిత్రం చాలా బావుంది. ఇలాంటి చిత్రాలతో ఇండియన్ సినిమా స్థాయి మరింతగా పెరుగుతోంది. తెలుగులో ఇలాంటి సినిమాలు రావడం గర్వకారణం.

Image result for anthariksham telugu

అంతరిక్షం చిత్రం పూర్తి స్థాయిలో సంతృప్తినివ్వలేదు. కొన్ని సన్నివేశాలు మాత్రమే బావున్నాయి. ఎక్కువగా బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి . మిషన్ వియజయవంతంగా పూర్తి చేయబడింది. కేవలం 70 రోజుల్లో సంకల్ప్, అతని టీం అద్భుతం చేశారు. అంతరిక్షం ఫస్ట్ హాఫ్ సూపర్ అంటూ రిపోర్ట్స్ వస్తున్నాయి. హాలీవుడ్ చిత్రం ఇంట్రస్టెల్లార్ కన్నా అంతరిక్షం మంచి అనుభూతిని ఇచ్చింది. అంతరిక్షం చిత్రానికి యావరేజ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: