తెలుగు ఇండస్ట్రీలో విశ్వనటుడు..నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు...ఇండస్ట్రీలో అందరూ ఆయనను ఎన్టీఆర్ అని పిలుస్తారు.  తెలుగు చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఘనత ఆయనకే దక్కుతుంది.  సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు.  అంత గొప్ప మహానుభావుడి జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఈ చిత్రం ఆడియో వేడుకలు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్, ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో వైభవంగా జరపనున్నారు. 

ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణను ఆహ్వానించడానికి ఆయన ఇంటికి బాలకృష్ణ వెళ్లారు. ఆ సమయంలో సీనియర్ నరేశ్ కూడా అక్కడే వున్నారు.  ఈ సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ లోని కొన్ని పాత్రలకు సంబంధించిన గెటప్స్ లో బాలకృష్ణ తన సెల్ ఫోన్లో సూపర్ స్టార్ కృష్ణకి బాలకృష్ణ చూపించారు.

ఆ ఫోటోలు చూసి కృష్ణ ఎంతోగానో సంతోషించారట..అంతే కాదు చాలా అద్భుతంగా ఉందంటూ బాలకృష్ణను అభినందించారట. అందుకు సంబంధించిన ఫోటోలను సీనియర్ నరేశ్ ట్వీట్ చేస్తూ, "ఎన్టీఆర్ గా వివిధ కోణాల్లో బాలకృష్ణ గెటప్స్ చూసి కృష్ణగారు ఫిదా అయ్యారు. కచ్చితంగా ఇది తెలుగు సినీ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు" అని అన్నారు.  గతంలో ఎన్టీఆర్, కృష్ణ కాంబినేషన్ లో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: