ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ లే హాట్ టాపిక్. ఓ వైపు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నారు. అదే సమయంలో లక్ష్మిపార్వతి నేపథ్యంలో సాగే స్టోరీని ఆధారంగా చేసుకుని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సినిమా తీస్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా సాంగ్ ను ఇవాళ రిలీజ్ చేశారు. చంద్రబాబుపై విషం కక్కారు.

Image result for lakshmis ntr

ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఎన్నో మలుపులున్నాయి. వాటిని ఆధారంగా తీసుకుని తెలుగులో ఇప్పుడు రెండు సినిమాలు సిద్ధమవుతున్నాయి. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి తొలి భాగాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఆ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ కు ఇవాళే ముహూర్తంగా నిర్ణయించారు. ఇప్పటికే రెండు పాటలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాను బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Image result for lakshmis ntr

ఇదే సమయంలో సెన్సేషన్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఓ సినిమా తీస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మిపార్వతి ప్రవేశించినప్పటి నుంచి ఆయన మరణం వరకూ సాగిన క్రమాన్ని ఆయన సినిమాగా రూపొందిస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. బాలకృష్ణ సినిమాలో లక్ష్మిపార్వతి రోల్ ఉండకపోవచ్చనేది టాలీవుడ్ గుసగుస. అందకే తాను లక్ష్మిపార్వతి నేపథ్యంలో సాగే స్టోరీనే తెరకెక్కిస్తున్నట్టు వర్మ ప్రకటించారు. వైసీపీకి చెందిన నేతలు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Image result for lakshmis ntr

లక్ష్మీస్ ఎన్టీరాఅ కు సంబంధించిన తొలిపాటను రామ్ గోపాల్ వర్మ యూట్యూబ్ లో విడుదల చేశారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే అర్థంలో సాగే ఈ పాట.. కుట్ర కుట్ర అంటూ సాగుతుంది. పాట ఆద్యంతం చంద్రబాబు ఫోటోలతోనే ఎడిటింగ్ చేశారు. చంద్రబాబు నమ్మించి వెన్నుపోటు పొడిచారంటూ సాగుతుందీ పాట. కల్యాణి మాలిక్ స్వరకర్తగా ఉన్న ఈ పాటను సిరా శ్రీ రాశారు. ఓ వైపు బాలయ్య ఎన్టీయార్ సినిమా ఆడియా రిలీజ్ రోజే .. వర్మ అంతకు ముందే ఆడియా సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇదిప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: