అన్న గారి జీవిత చరిత్రను ఎలా తీస్తారు, ఎటు నుంచి మొదలు పెడతారు అన్నది అందరిలోనూ ఉన్న సస్పెన్స్. అయితే క్రియేటివిటి పుష్కలంగా ఉన్న గొప్ప దర్శ‌కుడు క్రిష్ చేతిలో ఈ సినిమా పడ్డాక ఏకంగా అంచనాలు అంబరాన్ని అంటాయి. ఇపుడు ఈ మూవీ కధ ఏంటన్నది ఆడిలో లాంచ్ తరువాత కూడా పూర్తిగా తెలియకపోయినా క్రిష్ మాట్లాడిన దాని బట్టి, హీరో కళ్యాణ్ రాం మాట్లాడిన దాని బట్టి, చిత్ర కధానాయకుడు బాలయ్య చెప్పిన దాని బట్టీ చూసుకుంటే మాత్రం ఇది కచ్చితంగా సెంటిమెంట్ తో హ్రుదయాలను కదిలించే అపురూపమైన క్లాసిక్ అవుతుందనిపిస్తోంది.


ముఖ్యంగా క్రిష్ మాటల్లోనే చెప్పాలంటే ఈ మూవీ నందమూరి తారక రామారావు కధ, తిరగేస్తే రామ బసవ తారకం కధ. అంటే రామారావు జీవితంలో సగ భాగం అయిన ఆయన సతీమణి బసవరామ తారకం కోణంలో నుంచి ఈ మూవీ ఉండబోతోందన్న మాట. మహానటి మూవీలో కూడా సెంటిమెంట్ ఓ లెక్కలో పండింది. అలాగే ఎమోషన్లు అక్కడ పెద్ద పాత్ర పోషించాయి. అదే విధంగా ఎన్టీఆర్ జీవితంలో సగ భాగం అయిన బసవ రామ తారకం ఎన్టీఆర్  సాధించిన విజయాల వెనక ఎంతలా ఉన్నారు, ఏ విధంగా ప్రభావితం చేశారన్నది ఈ మూవీలో చూపించబోతున్నారన్నమాట.


దానికి నిదర్శనంగా ట్రైలర్ లో కూడా ఉన్న సీన్లు ఎన్నో కధలు చెబుతున్నాయి. రామారావు సినీ జీవితం, రాజకీయ జీవితం పరిపూర్ణంగా పండిందంటే అది పూర్తిగా బసవ రామ తారకం ఇచ్చిన ప్రేరణ, సహకారం అని ఎన్టీఆర్ బయోపిక్ లో చూపించబోతున్నారు. కళ్యాణ్ రాం మాట్లాడుతు, ఈ మూవీలో కొత్త రామారావుని చూస్తారు, మనకు ఎవరికీ తెలియని ఆయన జీవితం చూస్తారు అని హింట్ కూడా ఇచ్చారు. ఇక క్రిష్ ఈ సినిమా ఎన్టీఆర్ ఆత్మను పట్టుకుని తీసిన  మూవీ అన్నారు. ఇవన్నీ  చూస్తూంటే మాత్రం కచ్చింతంగా మహనటి మాదిరిగానే గొప్ప క్లాసికల్ మూవీలా ఉంటుందని తెలుస్తోంది. అదే జరిగితే అభిమానులకే  కాదు. తెలుగు జాతికి కూడా ఓ అద్భుతమైన సినిమా అందించినట్లే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: