నందమూరి అభిమానులకు కనువిందు చేస్తూ బాలయ్య జూనియర్ లు ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్ వేదిక పై కలిసి సందడి చేయడమే కాకుండా జూనియర్ తన ఎమోషనల్ స్పీచ్ తో ఈ కార్యక్రమానికి హైలెట్ గా మారాడు. అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ ఈవెంట్ కు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంతా రావడం నందమూరి అభిమానులకు జోష్ ను ఇచ్చింది. 
తొడగొట్టి తెలుగువాళ్ళం అని
ఈ కార్యక్రమానికి సంబంధించి కొనసాగుతున్న సస్పెన్స్ ను తొలగిస్తూ జూనియర్ చాల ముందుగానే ఈ ఫంక్షన్ కు వచ్చాడు. ఇక ఉద్వేగభరితంగా జూనియర్ చేసిన ఉపన్యాసం అందర్నీ ఆకట్టుకుంది. తాను ఇప్పటి వరకు బాలకృష్ణను కేవలం ఒక హీరోగా లేదంటే తన బాబాయ్ గా మాత్రమే చూశానని కానీ ఇప్పుడు తనకు తన బాబాయ్ లో పెద్దాయన ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు అంటూ ఉద్వేగభరితంగా స్పీచ్ ఇచ్చాడు జూనియర్.
 బాబాయ్ పక్కన ఇలా నిలబడితే
అయితే ఇక్కడ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇస్తూ తాను ఈకార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యుడుగా మాట్లాడటానికి రాలేదని ఒక మహానుభావుడు చేసిన త్యాగాల వలన లబ్ధిపొందిన తెలుగువాడిగా మాట్లాడడానికి వచ్చాను అంటూ తన స్పీచ్ లో అంతర్లీనంగా ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని కూడ గుర్తుకు చేసాడు. అంతేకాదు భూమ్మీద ధర్మం మూర్తీభవించిన వ్యక్తి లేడా అని వాల్మీకిని ఎవరైనా అడిగిఉన్నప్పుడు రామాయణం వ్రాసి ఉంటాడని అంటూ అదే ప్రశ్న ఇప్పుడు ఎవరైనా ఆలోచించి తెలుగువారిలో అలాంటి ధర్మ మూర్తి మళ్ళీ పుట్టడా అని అడిగితే ఆ ప్రశ్నలో నుంచి శ్రీరామ చంద్రుడి కటాక్షంతో ఉద్భవించిన ధృవ తార ఎన్టీఆర్ అంటూ తన తాత గురించి అత్యంత ఉద్వేగభరితంగా మాట్లాడాడు జూనియర్.
వాల్మీకిని అడిగారేమో
తెలుగువాడి పౌరుషం తెలుగువాడి ఖ్యాతి అని తొడగొట్టి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం అంటే ఎన్టీఆర్ గొప్పతనమే అంటూ అలాంటి వ్యక్తి ఇంకా ఉన్నారా అని తన పిల్లలు అడిగితే తన తాత గురించి తన పిల్లల తాత బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ను చూడమని చెపుతాను అంటూ జూనియర్ బాలయ్య వంక ఆత్మీయంగా చూస్తూ తనకు వస్తున్న కన్నీరును ఆపుకుని చేసిన ఉపన్యాసం జూనియర్ బాలయ్యల మధ్య ఇప్పటి వరకు ఉన్న గ్యాప్ ను పూర్తిగా చెరిపివేసింది. ఇలాంటి సినిమా తీసినందుకు తన బాబాయ్ ని ఏమని పోగడాలో తనకు మాటలు చాలడం లేదు అంటూ ఎన్టీఆర్ బయోపిక్ ఒక చరిత్ర ఈ చరిత్రకు జయాపజయాలు ఉండవు అంటూ జూనియర్ చేసిన ఉపన్యాసం నిన్నటి ఫంక్షన్ కు హైలెట్ గా మారింది..    



మరింత సమాచారం తెలుసుకోండి: