మెగా హీరో వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన సినిమా అంతరిక్షం. తెలుగులో వచ్చిన మొదటి స్పేస్ మూవీగా అంతరిక్షం భారీ అంచనాలను ఏర్పరచుకుంది. అయితే నిన్న రిలీజైన ఈ సినిమా ఆడియెన్స్ నుండి మిక్సెడ్ టాక్ సొంతం చేసుకుంది. అంతరిక్షం తప్పకుండా మంచి ప్రయత్నమని ఒప్పుకోవాల్సిందే.


అయితే ఘాజి సినిమాలో ఉన్న కొన్ని ప్లస్ పాయింట్స్ ఇందులో లేవని అంటున్నారు. ముఖ్యంగా అంతరిక్షం సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయ్యిందని టాక్. సినిమాకు ఆడియెన్ ఎంత కనెక్ట్ అయినా సినిమా మధ్యలో బోర్ అనిపిస్తుంది. సంకల్ప్ రెడ్డి కాలిక్యులేషన్ ఎక్కడ తప్పిందో అర్ధంకావట్లేదు. అయితే అంచనాలు అధికంగా ఉండటమే ఈ సినిమాకు మైనస్ అంటున్నారు.


వరుణ్ తేజ్ వరకు బాగానే చేశాడు. అయితే ఇంకా కొన్ని వావ్ ఫ్యాక్టర్స్ ఆశించారు ఆడియెన్స్. అందుకే సినిమా మీద కాస్త అసంతృప్తిగా ఉన్నారు. తెలుగులో వచ్చిన మొదటి స్పేష్ కాన్సెప్ట్ మూవీగా అంతరిక్షం సంచలనం సృష్టిస్తుందని భావించారు. అయితే ఆమేరకు చేసిన ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోకతప్పదు.


కాని ప్రయోగం చేశారు కదా అని ఎలా ఉన్నా చూసేయలేం. సినిమా ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే కచ్చితంగా మరో అద్భుతమైన సినిమా అయ్యుండేది. అయితే ఈ సినిమా సక్సెస్ ను బట్టి అంతరిక్షం పార్ట్ 2 చేస్తానని చెప్పాడు సంకల్ప్ రెడ్డి. ఈ సినిమా ఫలితం తేలింది మరి అంతరిక్షం-2 ఉంటుందా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: