కనీవిని ఎరుగని రీతిలోఅట్టహాసంగా నిన్నజరిగిన ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ లో కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పై చేసిన కామెంట్స్ అందరిని ఆశ్చర్యపరిచాయి. తన తండ్రి హరికృష్ణ పాత్రను పోషించిన కళ్యాణ్ రామ్ ఈ ఫంక్షన్ వేదిక పై మాట్లాడుతూ ఎన్ టి ఆర్  గురించి మాట్లాడే వయసు అర్హత  తనకు లేదు అనిఅంటూ ఇండియాన్ ఫిలిం ఇండస్ట్రీలో మొట్టమొదటి సూపర్ స్టార్ ఎన్టీఆర్ అంటూ కామెంట్స్ చేసాడు.
ఇది కేవలం బాబాయ్ ఒక్కరి వల్లే అవుతుంది
తనను ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సూపర్ స్టార్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ఏదో చేయాలనే తపనతో ఎన్టీఆర్ ఒక గొప్ప నాయకుడు అయిన విషయాన్ని వివరిస్తూ తనను ఈస్థాయికి తీసుకొచ్చిన వారికి ఏదో చేయాలి వారి రుణం తీర్చుకోవాలి అన్న తపనతో ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చిన విషయాన్ని వివరిస్తూ ఆడవారికి ఆస్థిలో సమానహక్కు పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం తెచ్చిన ఎన్టీఆర్ ఖ్యాతి చరిత్రలో సుస్థిరం అంటూ కామెంట్స్ చేసాడు.   
15వ ఏటనే నాకు నాన్నతో పరిచయం అయింది, ఆయన జీవితం తాతగారి సేవలోనే
యుగ పురుషుడులాంటి అలాంటి వ్యక్తి పై సినిమా చేయాలంటే మామూలు విషయంకాదని   ఇలాంటి సినిమా తీయడం తన బాబాయి బాలకృష్ణ వల్లే అవుతుంది అంటూ ఈమూవీ తీయాలి అంటే అవసరమైన బాధ్యత గౌరవం ఒక అద్భుతమైన వ్యాల్యూస్‌ ఒక్క బాలకృష్ణకు మాత్రమే  ఉన్నాయి అంటూ ప్రశంసలు కురిపించాడు. తన బాబాయ్ స్థాపించిన ఎన్‌బికె ఫిల్మ్స్ నందమూరి కుటుంబ సభ్యుల బేనర్ అంటూ తన సినిమా జీవితం మొదలు పెట్టింది బాలకృష్ణ  ‘బాలగోపాలుడు’ సినిమాతో సరిగ్గా 30 ఏళ్ల క్రితం ప్రారంభం అయిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.
ఇలాంటి అవకాశం వస్తే వదులుకుంటానా?
తన బాబాయితో 30 ఏళ్ల క్రితం నటించిన తరువాత తిరిగి ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాలయ్యతో కలిసి నటించడం తన అదృష్టం అంటూ కామెంట్స్ చేసాడు. అయితే ఈమూవీలో తన గెటప్ తన తండ్రి హరికృష్ణ తన 25వ సంవత్సరంలో ఎలా ఉన్నాడో అచ్చం తాను అలాగే ఉన్నాను అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్న విషయాన్ని వివరిస్తూ తన చిన్నతనంలో తనకు 15 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు తాను తన తండ్రి హరికృష్ణను చూడలేదని దీనికి కారణం తన తండ్రి ఎన్టీఆర్ జీవించి ఉన్న కాలంలో ఎప్పుడు తన తండ్రి ధ్యాసలోనే ఉంటూ కనీసం తమను చూడలేదు అంటూ తమ కుటుంబం అంతా ‘నాన్న పిచ్చి వాళ్ళం’ అంటూ ఉద్వేగంగా కన్నీటి పర్యంతం అయ్యాడు కళ్యాణ్ రామ్..
 


మరింత సమాచారం తెలుసుకోండి: