ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కనిపిస్తే బాగుండును అని నందమూరి అభిమానులు అంతా ఆసిస్తూ ఉంటే ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ మునిమనవాడు ఈమూవీలో కనిపించబోతూ ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది. ఈ బయోపిక్ లో బాలకృష్ణ ఎన్టీఆర్ గా నటిస్తున్న నేపధ్యంలో బాలయ్య పాత్రను ఎవరు నటించారు అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది. 
 అన్నయ్య మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా
అయితే మోక్షజ్ఞ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వని బాలకృష్ణ ఎవ్వరూ ఊహించని షాకింగ్ న్యూస్ బయటపెట్టాడు. ఈమూవీలో పసిపిల్లవాడుగా ఉన్న బాలకృష్ణ పాత్రలో బాలయ్య రెండవ మనవడు నటించాడు. బాలయ్య రెండవ కూతురు తేజస్విని నెలల పిల్లవాడు ఈమూవీలో బుల్లి బాలయ్యగా కనిపించినట్లు స్వయంగా బాలకృష్ణ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 
ఆ విషయం ఇక్కడ చెప్పకూడదు
ఈమూవీలో మరో కీలక పాత్రలో నటించిన సీనియర్ యాక్టర్ నరేశ్ మాట్లాడుతూ ‘బాహుబలి’ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న సస్పెన్స్ రాజమౌళి కొనసాగించినట్లుగా బాలకృష్ణ ఈమూవీలో తన చిన్ననాటి పాత్రను ఎవరు చేసారు అన్న విషయమై సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేసాడు. ఈమాటలకు బాలయ్య నవ్వడంతో ఒకవేళ నిజంగానే ఈమూవీలో మోక్షజ్ఞ ఉన్నాడా అన్న అనుమానాలు మళ్ళీ మొదలయ్యాయి. 
అది ఎవరి బిడ్డగానో పుడితే వచ్చేది కాదు
ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకుండా రాజకీయాల జోలికి వెళ్ళకుండా హుందాగా నిర్వహించిన నిన్నటి ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ నిర్వహణ బాలయ్య సమయస్పూర్తికి నిదర్శనం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కీరవాణి అందించిన ఈమూవీకి సంబంధించిన పాటలు కేవలం నందమూరి అభిమానులకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండటం ఈ బయోపిక్ విషయంలో బాలయ్య తీసుకున్న జాగ్రత్తలకు నిదర్శనం..


మరింత సమాచారం తెలుసుకోండి: