కాజల్ అగర్వాల్లో కొత్త కోణం ఒకటి బయటకు వచ్చింది. చాన్నాళ్ళుగా గ్లామర్ డాల్ గా ఉన్న ఈ అమ్మడు ఇపుడు మూడు పదుల వయసు దాటినా తన హవా చాటుతోంది. ఇదిఓ కెరీర్ ఎండ్ అన్న ప్రతీసారి ఏదో మూవీ చెతిలో ఉంచుకుని మళ్ళీ సత్తా చాటుతోంది. ఇపుడు కూడా అలాగే  కాజల్ మళ్ళీ వెండి తెరపై చందమామలా మెరిసేందుకు గట్టి కసరత్తునే చేస్తోంది.


ఆమధ్య కమల్‌హాసన్‌తో ఒక చిత్రం చేయబోతున్నట్లుగా సగం క్లారిటీ ఇచ్చిన కాజల్ ‘ఇండియన్ 2’ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ‘ఇండియన్ 2’ కోసం ఈమె కళరియపట్టు అనే కళ నేర్చుకుంటుందన్నది పాత మాటే. అయతే, ఆ కళలో ఇప్పుడు ఆరితేరిందట. కళకు సంబంధించిన పుస్తకానూ చదువుతుందన్నది టాక్. తాజాగా ఆ కళకు సంబంధించిన పుస్తకాన్ని చదువుతూ ఓ ఫొటో షేర్ చేసింది. ఇండియన్ 2 కోసమే కాజల్ అది చదువుతుందని ఇప్పటివరకు మార్షల్ ఆర్ట్స్ గురించి పెద్దగా అవసరం పడని కాజల్ ఈసారి ఈ సినిమా కోసం చాలా కష్టాన్నే ర్కోబోతున్నట్లుగా చెబుతున్నారు.


ఇక  కమల్‌హాసన్, శంకర్‌ల కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందబోతున్న ‘ఇండియన్ 2’ మూవీ వచ్చేనెలలో పట్టాలెక్కబోతుంది.మొత్తానికి కాజల్ నా మజాకానా అనిపించేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఓవైపు కమల్ హాసన్, మరో వైపు కాజల్ ఇలా వీరిద్దరూ పాత్ర కోసం అలా ప్రణం పెట్టేస్తూనే ఇండియన్ 2 పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయిపుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: