నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను ఆవిష్కరిస్తానంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రూపొందిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. ఆ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశారు. జనవరి, ఫిబ్రవరిల్లో బాలయ్య నిర్మిస్తున్న ఎన్టీఆర్ కథనాయకుడు, మహానాయకుడు విడుదలవుతున్న నేపథ్యలో వర్మ సినిమా రిలీజ్ డేట్ పై అంతటా ఉత్కంఠ నెలకొంది.

Image result for lakshmis ntr movie


ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్‌ జనవరి 24న విడుదల అవుతుందని వర్మ ప్రకటించడం విశేషం. ఇప్పటికే వర్మ విడుదల చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు సాంగ్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటపై ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో లక్ష్మీస్ఎన్టీర్ రిలీజ్ డేట్‌ను వర్మ ప్రకటించడం ఆసక్తిరేపుతుంది. బాలయ్య నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాల కన్నా తన సినిమా ఒక్కటే నిజం చెబుతుందని రామ్ గోపాల్ వర్మ దీమాగా చెబుతున్నారు.

Image result for lakshmis ntr movie

స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ఆశీస్సులు తన సినిమాకు మాత్రమే ఉంటాయంటున్న వర్మ.. తన సినిమా ఒక్కటే వాస్తవాలను వెల్లడిస్తుందని కుండబద్దలు కొడుతున్నారు. ఈ సినిమా కోసం తాను చాలా కసరత్తు చేసి కథ రాసుకున్నానన్నారు వర్మ. తెలుగు సినీ చరిత్రలో వందల సినిమాల్లో అప్సరసలను మించిన హీరోయిన్లతో నటించిన ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి వంటి సాధారణ మహిళను పెళ్లి చేసుకోవడం తనను ఆకర్షించిందని వర్మ చెప్పుకొచ్చారు.

Related image


అలాంటి అందగత్తెల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఎన్టీఆర్ ఏం చూశారో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఈ కథపై పరిశోధన చేశానన్నారు. తన సినిమాలో అన్నీ వాస్తవాలే ఉంటాయంటున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ జనవరి 24న విడుదల కాబోతోంది. అదే నిజమైతే ఫిబ్రవరిలో విడుదల కానున్న బాలయ్య సినిమా ఎన్టీఆర్ మహానాయకుడుకు ముందే ఈ సినిమా వస్తుందన్నమాట. అది బాలయ్య సినిమాకు ఇబ్బందిగా మారే ఛాన్సుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: