కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ సేతుపతి కేవలం  హీరోగానే కాదు విలన్ గా సపోర్టింగ్ యాక్టర్ గా అన్ని పాత్రల్లో తన సత్తా చాటుతూ వస్తున్నాడు. ఈ ఇయర్ అయితే నవాబ్, 96 సినిమాల హిట్ తో కోలీవుడ్ లో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్న విజయ్ సేతుపతి వరుస హిట్లు కొట్టినా అతనికి నష్టాలు తపట్లేదట.


విజయ్ సేతుపతి ఎంతో ఇష్టపడి నిర్మించిన సినిమా జుంగా. బ్లాక్ కామెడీ మూవీగా వచ్చిన జుంగా సినిమాకు విజయ్ నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. వింజయ్ నిర్మించాడు కాబట్టి కచ్చితంగా బాగుంటుందని భావించారు తమిళ ఆడియెన్స్. కాని అంచనాలు తారు మారవడంతో విజయ్ కు భారీ నష్టం వచ్చిందట.


ఆ సినిమా మొత్తం ఫారిన్ లో షూట్ చేయడం వల్ల ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వచ్చిందట. దాదాపుగా జుంగా సినిమా విజయ్ కు 11 కోట్ల నష్టం తెచ్చిందని ఈమధ్య తాను ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ సినిమా మిగిల్చిన నష్టాలకు విజయ్ మూడు సినిమాలు ఒప్పుకోవాల్సి వచ్చిందట. అలా విజయ్ సేతుపతి వరుస విజయాలను అందుకుంటున్నా నిర్మాతగా మాత్రం పెద్ద షాక్ తగిలింది.


మరి నిర్మాతగా విజయ్ ఇక వద్దని అనుకుంటాడో లేక మళ్లో ప్రయత్నం చేస్తాడో చూడాలి. హీరో, విలన్ అనే తేడా లేకుండా విజయ్ సేతుపతి చేస్తున్న సినిమాలు మాత్రం మంచి హిట్ కొడుతున్నాయి. తెలుగులో సైరా సినిమాలో విజయ్ నటిస్తున్నాడు. ఇక తను నటించిన 96 మూవీ తెలుగులో శర్వానంద్ రీమేక్ చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: