కామెడీ స్టార్ స్టేటస్ నుండి హీరోగా మారి తిరిగి యూటర్న్ తీసుకుని తనకు పేరు తెచ్చి పెట్టిన కామెడీ పాత్రలను చేయడానికి తిరిగి ప్రయత్నిస్తున్న సునీల్ ను వెంటాడుతున్న దురదృష్టం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. సునీల్ సినిమా స్క్రీన్ పై కనిపిస్తే చాలు నవ్విస్తాడు అన్న అభిప్రాయం నుండి సునీల్ స్క్రీన్ పై కనిపించినా ప్రేక్షకులు ప్రస్తుతం నవ్వని స్థితిని చూస్తున్న చాలామంది షాక్ అవుతున్నారు.

తన ప్రియ మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహకారంతో ‘అరవింద సమేత’ లో నటించినా ఆసినిమా విజయం సాధించినా సునీల్ కు ఏమాత్రం పేరు రాలేదు. ఆతరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజాతో కలిసి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో నటించినా ఆ సినిమాలోని సునీల్ పాత్ర గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థుతులలో గతవారం విడుదలైన ‘పడి పడి లేచె మనసు’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు సునీల్. 

ఈమూవీకి సంబంధించి సెకండ్ ఆఫ్ లో వచ్చిన సునీల్ పాత్ర కీలకం అయినప్పటికీ ఈమూవీలోని సునీల్ పాత్రకు సంబంధించిన బాడీ లాంగ్వేజ్‌ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఇలా ఏవిషయంలోనూ సునీల్ రాణించ లేకపోయాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు ఈమూవీలో వచ్చే సీన్స్ లో కొన్ని సంద‌ర్భాల్లో ఎలాంటి ఎక్స్‌ ప్రెష‌న్ లేని సునీల్‌ ని చూస్తుంటే సునీల్ న‌వ్వించ‌డం కూడా మ‌ర్చిపోయాడా అంటూ చాలామంది ఆశ్చర్య పడుతున్నారు. 

సునీల్ ఈమధ్య కామెడీ పాత్రలు చేసిన సినిమాలు అన్నీ పేరున్న దర్శకులవి అయినప్పటికీ సునీల్ ఫెయిల్ అవ్వడం చూస్తుంటే అది దర్శకుల లోపమా లేదంటే ఆపాత్రలను క్రియేట్ చేసిన రచయితల లోపమా అన్న కోణంలో విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు సునీల్ తన కామెడీకి సంబంధించి ఎంచుకునే పాత్రలు ప్రాధాన్యత లేకుండా ఇలా వరసపెట్టి చేసుకుంటూ పోతే సునీల్ కామెడీ కూడ చేయలేకపోతున్నాడు అన్న విమర్శలు వచ్చే ఆస్కారం ఉంది. దీనికితోడు సునీల్ ఈమధ్య బాగా లావుగా కనిపిస్తూ మోహంలో గ్లో తగ్గిపోవడం కూడ సునీల్ కు మరొక శాపంగా మారింది. కామెడీ యాక్టర్స్ మధ్య విపరీతమైన పోటీ ఉన్న పరిస్థుతులలో ఇలాంటి పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే సునీల్ పూర్తిగా ఫేడ్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: