టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్స్ లో నంబర్ రేటింగ్ ఇస్తే ఎవరు ముందు ఎవరు వెనకాల అన్నది చెప్పడం కాస్త కష్టమే. మహేష్, ఎన్.టి.ఆర్, రాం చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా అందరు సీరియల్ లో ఉన్నారు. ఏ హీరో అభిమాని తమ హీరోనే నంబర్ 1 అని చెబుతుంటారు. ఇదిలాఉంటే ఇదే విషయాన్ని ప్రభాస్ ను అడిగితే ఎలాంటి ఆన్సర్ వస్తుంది.


కాఫీ విత్ కరణ్ లో ప్రభాస్ ముందు ఇదే ప్రశ్న ముందు ఉంచాడు కరణ్. 1,2,3,4 లలో మహేష్, ఎన్.టి.ఆర్, రాం చరణ్, బన్ని వీళ్లలో నీ రేటింగ్ ఏంటి అని అడిగాడు. అయితే ప్రభాస్ తడుముకోకుండా నంబర్ 1 ఎన్.టి.ఆర్ అనేశాడు. 2 మహేష్, 3,4 గురించి కాస్త ఆలోచించి బన్ని, చరణ్ అని చెప్పాడు.


సో ప్రభాస్ దృష్టిలో ఎన్.టి.ఆర్ బెస్ట్ స్క్రీన్ పర్ఫార్మర్ అన్నమాట. అది తను చెప్పినా చెప్పకున్నా మన టాలీవుడ్ లో నటుడు అంటే ముందు గుర్తొచ్చేది తారక్ ఒక్కడే. ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసే స్ట్రెంత్ ఉన్న హీరో అతను. అయితే మహేష్, బన్ని, చరణ్ లు కూడా ఏం తీసేసే విధంగా లేరు.


ఎంచుకున్న సినిమా ఎలాంటిదైనా దానికి తగినట్టుగా వారి నటనా ప్రతిభతో మెప్పిస్తున్నారు. అందుకే వారికి ఈ రేంజ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ తన దృషిలో ఈ రేటింగ్ ఇచ్చాడు. ఈ రేటింగ్ వేరే వారి దగ్గరకు వెళ్తే మారే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరదాగా సాగిన కాఫీ విత్ కరణ్ షోలో ఎన్నో విషయాలను వెళ్లడించారు రాజమౌళి, ప్రభాస్, రానా. 



మరింత సమాచారం తెలుసుకోండి: