ఎస్‌.ఎస్‌. రాజమౌళి.. ఇది పేరు కాదు.. ఓ బ్రాండ్.. అవును నిజమే. ఈ విషయం ఇప్పుడు జగమంతా గుర్తించింది. కానీ రాజమౌళి మాత్రం మొదట్లోనే గుర్తించాడు. అందుకే తన సినిమాల చివర్లో ఓ రాజముద్ర వస్తుంది. యాన్ ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్‌ అని. సినిమా కోసం ఎలాంటి కష్టమైనా పడేందుకు సిద్ధపడతాడు రాజమౌళి.

Image result for rajamouli karan with johar


బాహుబలి సినిమాతో రాజమౌళి అంటే ఏంటో ప్రపంచమంతా చూసింది. ఒక తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన రాజమౌళి.. ఇటీవల కాఫీ విత్ కరణ్‌ అనే టీవీ ప్రోగ్రామ్‌లో హీరో ప్రభాస్, రాణాలతో కలసి పాల్గొన్నాడు. ఈ సమయంలో కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పాడు.

Image result for bahubali anushka


ప్రత్యేకించి బాహుబలిలో కీలక పాత్ర అయిన దేవసేన గురించి చర్చ వచ్చింది. దేవసేనగా అనుష్క అదరగొట్టిన సంగతి తెలిసిందే. మరి ఇదే పాత్ర అనుష్క కాకుండా ఇంకెవరిని తీసుకుంటారు అని ప్రశ్నించాడు కరణ్. అప్పడు రాజమౌళి చెప్పిన సమాధానం దీపికా పదుకొనె.

Related image


ఒకవేళ బాహుబలిని హిందీ డబ్బింగ్ చేయకుండా రీమేక్ చేసి ఉంటే రాజమౌళి దేవసేన పాత్రకు ఆమెనే తీసుకునే వాడేమో మరి. అలాగే రాజమౌళి మరో ఇంట్రస్టింగ్ కబురు చెప్పారు. అదేమిటంటే.. తాను తన భార్యకు భయపడతానని చెప్పాడు. మీకు మీ భార్యంటే భయమా అని కరణ్ జోహార్ అడిగితే.. అవును భయమే. కానీ కొన్ని విషయాల్లోనే. అది కూడా గౌరవంతో కూడిన భయం అంటూ రాజమౌళ్ వివరణ ఇచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: