టాలీవుడ్ లో ఇప్పుడు వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే సినీ నేపథ్యంలో వచ్చిన మహానటి మంచి హిట్ అయ్యింది.  క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ సినిమా రూపొందుతుంది.  ఈ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుకలు హైదరాబాద్ లో జరిగాయి.  ఈ వేడుకకు ఎంతో మంది సినీ తారలు, టెక్నీషియన్లు, దర్శక, నిర్మాతలు విచ్చేశారు.  అయితే ఎన్టీఆర్ బయోపిక్ గురించి విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ..ఒకే తల్లి గర్భంలో పుట్టకపోయినా..ఎన్టీఆర్ తనకు సోదరుడు అని..అందుకే ఆయనను అన్నగారు అని పిలుస్తానని అన్నారు.ఎన్టీఆర్ తో తనకు అంతటి అనుబంధం వుందని ఆయన అంటారు.
Related image
తాజాగా ఎన్టీఆర్ తో కలిసి పనిచేసిన సమయంలో తన అనుభవాలను మోహన్ బాబు పంచుకున్నారు.  సాధారణంగా ఎన్టీఆర్ పర్సనల్ మేకప్ మెన్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకునేవారు..ఆయన తప్ప ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు.  అలాంటిది ఒకానొక సందర్భంలో పర్సనల్ మేకప్ మెన్ కాకుండా అన్నగారికి మేకప్ వేసిన తొలి వ్యక్తిని తానేనని గర్వంగా చెప్పారు. మేజర్ చంద్రకాంత్(1993) సినిమాలో ‘పుణ్యభూమి నా దేశం’ పాట కోసం ఎన్టీఆర్ చాలా గెటప్పులు వేశారని గుర్తుచేసుకున్నారు. 

ఆయన ఏసినిమా కమిట్ మెంట్ అయినా..కరెక్ట్ టైమ్ ఫాలో అయ్యేవారని..ఉదయం 7 గంటలకే స్పాట్ కు వచ్చేసేవారని తెలిపారు. ఎన్టీఆర్ అంతటి గొప్ప వ్యక్తని వ్యాఖ్యానించారు. మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ తో దిగిన ఓ ఫొటోను ఈ సందర్భంగా మోహన్ బాబు ట్విట్టర్ లో పంచుకున్నారు.మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ ను ఇతర భాషల్లో కూడా విడుదల చెయ్యడం నందమూరి అభిమానులకు హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: