టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు.  స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు తనయుడు విక్టరీ వెంకటేష్ హీరోగా ఎంతో సక్సెస్ సాధించాడు.  కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ అన్ని రకాల పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు.  డి.రామానాయుడు పెద్ద కొడుకు డి.సురేష్ బాబు నిర్మాతగా సెటిల్ అయ్యారు.  ఆయన తనయుడు దగ్గుబాటి రానా ‘లీడర్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.   లీడర్ మంచి సక్సెస్ అయినా..తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయాయి. 
Image result for trisha rana
రానా తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి పేరు సంపాదించాడు. ఇక రాజమౌళి తీసిన ‘బాహుబలి, బాహుబలి2’సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రానా ‘ఎన్టీఆర్’బయోపిక్ లో ఏపి సీఎం చంద్రబాబు పాత్రలో కనిపించబోతున్నాడు. అప్పట్లో రానా నటుడిగా కన్నా హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నాడంటూ తెగ వార్తలు వచ్చేవి. శ్రీయ , బిపాసా బసు , రకుల్ ఇలా చాలామంది తో రానా డేటింగ్ చేసాడనే వార్తలు చక్కర్లు కొట్టాయి.
Image result for rana prabhas rajamouli karan johar interview
కాకపోతే ఈ హీరోయిన్లందరూ ఒక ఎత్తైతే..త్రిష మాత్రం రానాతో చాలా కాలం వరకు డేటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి..అంతే కాదు త్వరలో వీళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదే విషయంపై ఈ మద్య బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరన్ జోహార్.. రానా ను అడిగాడు. ఇటీవలే రానా , రాజమౌళి , ప్రభాస్ లు కరణ్ విత్ జోహార్ అనే కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్య క్రమం లో త్రిషతో డేటింగ్ చేశావు కదా, పెళ్లెందుకు చేసుకోలేదని సూటిగా ప్రశ్నించాడు కరణ్ జోహార్.

ఈ ప్రశ్నకు వెంటనే రానా సమాధానం చెబుతూ..అబ్బే అలాంటిది ఏమీ లేదని..త్రిషతో తాను చాలా కాలం వరకు స్నేహాన్ని కొనసాగించానని అందుకే చాలా మంది తమను అపార్థం చేసుకున్నారని..త్రిష తనకు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరని అన్నారు.   మరి పెళ్లెప్పుడు అని అడిగితే చరణ్, బన్నీ పెళ్లి చేసుకొని బిజీ అయిపోయారని, తను అలా బిజీ అవ్వనని చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: